P Venkatesh
ఐటీఐ పూర్తి చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులను అస్సలు వదలకండి. వెంటనే అప్లై చేసుకోండి.
ఐటీఐ పూర్తి చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులను అస్సలు వదలకండి. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో పాటు ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ప్రతిభకనబర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్య్వూలు ఎదుర్కోవాలి. అన్ని దశల్లో ప్రతిభ చూపితే తప్పా ప్రభుత్వ ఉద్యోగం సొంతం కాదు. అయితే ఇటీవల యువత తక్కువ సమయంలోనే ఉపాధి అవకాశాలు పొందాలని ఒకేషనల్, ఐటీఐ వంటి కోర్సులను చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరి మీరు కూడా ఐటీఐ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా?.. అయితే మీకు ఇదే మంచి అవకాశం. పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.
ఐటీఐ పాసైన వారికి రక్షణ రంగ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. రక్షణ శాఖలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీలో అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 127 ఐటీఐ అప్రెంటీస్‌షిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టర్నర్, మెకానిస్ట్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఐటీఐ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ apprenticeshipindia.gov.inను సందర్శించి మే 31 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.