సమర్థవంతమైన పరిపాలనతో ప్రజలకు మంచి చేసేందుకు పరిపాలనా అనుభవం అవసరం లేదని 21 నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, పరిపాలనా పరంగా తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు ప్రజలకు అత్యున్నత స్థాయిలో మేలు చేశాయి. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, సరళతరంగా అందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, […]
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లమీన్ (ఏఐఎంఐఎం)… తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పాతబస్తీకి, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికే పరిమితమైన ఈ పార్టీ రూపురేఖలు ప్రస్తుతం మారిపోతున్నాయి. నగరం దాటి దేశంలోని వివిధ రాష్ట్రాలలో సత్తా చాటాలని ఎంఐఎం చేసిన ప్రయత్నాలు బిహార్ ఎన్నికల తర్వాత సఫలమవుతున్నాయి. గడచిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోవడం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆలోచింపజేసింది. అంతకు ముందు మహారాష్ట్రలోనూ ఆ పార్టీ […]
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తో డిఎంకె ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూశారు. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన ఎమ్మెల్యే అన్బళగన్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళనీస్వామి ట్విట్టర్లో ప్రకటించారు. అన్బళగన్ ప్రస్తుతం చేప్పాక్కం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడే అన్బళగన్ మరణించారు. కరోనా సోకి ఒక శాసన సభ్యుడు మరణించడం దేశంలో ఇదే ప్రథమం. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే […]
దేశంలో ఎన్నికలు జరిగితే వ్యూహకర్తల హవా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలన్నీ వీరినే నమ్ముకుంటాయి. వీరి అడుగుజాడల్లోనే. కనుసన్నల్లోనే ఆయా పార్టీలు ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్తాయి. ఎన్నికల వ్యూహకర్తల వ్యూహలు పలించిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల వ్యూహకర్తల వ్యవహరం మనేది 2014 ఎన్నికల సమయంలో బయటకు వచ్చింది. అంతకు ముందు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో చర్చకు రాలేదు. అప్పుడు సలహాదారుడు అనేవారు. ఇప్పుడు వ్యూహకర్త అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ […]
తమిళనాడు రాష్ట్రంలో ప్రతిపక్ష ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు 24 గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో డీఎంకే శ్రేణులు శోకసంద్రంలో మునిగాయి. గుడియాతం ఎమ్మెల్యే ఎస్.కథవరాయణ్ (58), తిరువత్తియూరు ఎమ్మెల్యే కేపీపీ స్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో గుడియాతం ఎమ్మెల్యే కథవరాయణ్ బాధపడుతున్నారు.ఇటీవలే చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకొని చికిత్స పొందుతున్నారు.శుక్రవారం ఉదయం ఆరోగ్యం విషమించగా కథవరాయణ్ ను బతికించడానికి డాక్టర్లు శతవిధాల ప్రయత్నం […]