iDreamPost
android-app
ios-app

Rajinikanth: రజినీకాంత్ సంచలన కామెంట్స్.. విజయ్ ఫ్యాన్స్ ఫైర్! ఏం జరిగిందంటే?

  • Published Aug 25, 2024 | 5:44 PM Updated Updated Aug 25, 2024 | 5:44 PM

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక తలైవా కామెంట్స్ పై దళపతి విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక తలైవా కామెంట్స్ పై దళపతి విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Rajinikanth: రజినీకాంత్ సంచలన కామెంట్స్.. విజయ్ ఫ్యాన్స్ ఫైర్! ఏం జరిగిందంటే?

కొన్ని కొన్ని సందర్భాల్లో హీరోలు మాట్లాడిన మాటలు వివాదాలకు దారితీస్తుంటాయి. వారు కావాలని మాట్లాడనప్పటికీ.. అవి కాంట్రవర్సీలుగా మారుతూ ఉంటాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక తలైవా కామెంట్స్ పై దళపతి విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉండే రజినీకాంత్ ఏమన్నాడు? విజయ్ ఫ్యాన్స్ ఫైర్ కావడానికి రీజన్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్ లో రజినీ చేసిన పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. సూపర్ స్టార్ మాట్లాడుతూ..”డీఎంకే పార్టీ మర్రి చెట్టులాంటింది. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. ఎంత పెద్ద తుఫాన్ నునైనా ఎదుర్కొగలిగే శక్తి డీఎంకే పార్టీకి ఉంది. ఇక కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంట సేపు మాట్లాడారంటేనే ఆయన స్థాయి ఏంటో అర్ధం అవుతుంది. ఆయనకు వచ్చిన సమస్యలు ఎవరికైనా వచ్చి ఉంటే.. ఎప్పుడో కనుమరుగైపోయేవారు. సీఎం స్టాలిన్ అద్భుతంగా పనిచేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్.

కాగా.. సూపర్ స్టార్ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ పై దళపతి విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ తన ప్రణాళికలను రచిస్తున్నాడు. తాజాగా తన పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం జెండాను కూడా ఆవిష్కరించాడు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు విజయ్ పార్టీని ఉద్దేశించే అని ఫ్యాన్స్ సూపర్ స్టార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం రజినీ విజయ్ పార్టీని ఉద్దేశించి అనలేదని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ.. సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.