iDreamPost

Vijay: NEET వివాదం.. కేంద్ర ప్రభుత్వంపై హీరో విజయ్‌ సంచలన వ్యాఖ్యలు

  • Published Jul 03, 2024 | 2:55 PMUpdated Jul 03, 2024 | 2:55 PM

నీట్‌ పరీక్ష వివాదంపై తమిళ స్టార్‌ హీరో విజయ్‌ స్పందిస్తూ.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

నీట్‌ పరీక్ష వివాదంపై తమిళ స్టార్‌ హీరో విజయ్‌ స్పందిస్తూ.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

  • Published Jul 03, 2024 | 2:55 PMUpdated Jul 03, 2024 | 2:55 PM
Vijay: NEET వివాదం.. కేంద్ర ప్రభుత్వంపై హీరో విజయ్‌ సంచలన వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధ్వర్యంలో నీట్‌యూజీ పరీక్ష నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తుండగా.. ఇక ఈ ఏడాది నీట్‌ యూజీ-2024 పరీక్ష నిర్వహణలో లోపాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. పార్లమెంట్‌లో దీనిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిష్టాత్మక నీట్‌ పేపర్‌ లీక్‌ కావడం సంచంనలంగా మారింది. నీట్‌ పరీక్ష రద్దుకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలో నీట్‌ పరీక్ష రద్దుకు పిలుపునిస్తూ విద్యార్థి సంఘాలు.. జూలై 4 దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక నీట్‌ పరీక్ష నిర్వహణపై తమిళనాడు రాష్ట్రం ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నీట్‌ పరీక్ష నిర్వహణ వైఫల్యం తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ తొలిసారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆవివరాలు..

నీట్‌ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు హీరో విజయ్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నీట్‌ పరీక్షపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. దేశానికి ఈ ఎగ్జామ్‌ అవసరం లేదు. నీట్‌ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం. ఇటీవలే నీట్‌ రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీన్ని నేను స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. విద్యను ఉమ్మడి జాబితా నుంచి తొలగించి.. రాష్ట్ర జాబితాకు తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతున్నాం. అంతేకాక తాత్కలిక పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించి.. ప్రత్యేక ఉమ్మడి జాబితాను తయారు చేయాలి. దానిలో విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలి’’ అని చెప్పుకొచ్చారు.

‘‘మీరు రాష్ట్ర భాష, సిలబస్‌లో చదివి.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లోపరీక్ష రాస్తే.. అది ఎలా పని చేస్తుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివి.. మెడిసిన్‌ చేయాలనుకునే విద్యార్థులకు నీట్‌ పరీక్ష​ చాలా కష్టంగా మారింది. అందుకే దీన్ని రద్దు చేయాలి. ఒకే దేశం, ఒక సిలబస్‌, ఒక పరీక్ష ప్రాథమిక విద్య ఉద్దేశానికి వ్యతిరేకం. కనుక కేంద్రం ఆదిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’అన్నారు.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో మే 5న నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 4,570 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్‌ రాశారు. అయితే.. ఎప్పుడు లేనిది ఈ సారి.. నీట్‌ పరీక్షలో ఒకేసారి 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం. అంతేకాకుండా ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్‌ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసింది. దాంతో వివాదం రేగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి