IPLలో చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ధోని ఎన్నో విజయాలని అందించాడు. నాలుగు సార్లు కప్పు కూడా గెలిచాడు. అయితే IPL 2022 సీజన్లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోని వారసుడిగా రవీంద్ర జడేజాని ఎన్నుకొని అతన్ని కెప్టెన్ చేశారు. అయితే ఈ సీజన్లో చెన్నై సరైన ప్రదర్శన కనబర్చలేదు. దీంతో పాయింట్ల పట్టికలోచివరి నుంచి రెండో స్థానంలో ఉండి ప్లే ఆఫ్ ఆశలు కూడా లేకుండా చేసింది. అంతే కాక జడేజా ఆట […]
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.కానీ సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని అతడి కుటుంబం ఆరోపించింది. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు సుశాంత్ కాదని సీబీఐతో విచారణ జరిపించాలని సుశాంత్ మామ ఆర్.సి.సింగ్ డిమాండ్ చేశారు. కాగా తాజాగా సుశాంత్‌ది ఆత్మహత్యే అని పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చింది. అతనిది హత్య కాదని ఆత్మహత్య చేసుకున్నారని పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చడంతో ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. గత […]
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గత తొమ్మిది నెలలుగా విశ్రాంతి పేరుతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్‌లకి భారత సెలెక్టర్లు అవకాశం కల్పించి పరీక్షించారు. వీరిలో మిగతా ఇద్దరి కంటే ఎక్కువగా ధోనీ స్థానంలో ఈ ఏడాది జనవరి వరకూ రిషబ్ పంత్కి వరుసగా అవకాశాలు దక్కాయి. కానీ అతను జట్టు యాజమాన్యం అంచనాల మేర రాణించలేకపోయాడు.ఈ […]
భారత అగ్ర ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, ధోనీ,కోహ్లీ నుంచి మైదానం లోపలా బయటా ఎలా హుందాగా ప్రవర్తించాలో నేర్చుకోవాలని తన సోదరుడు, పాక్ నిషేధిత క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు వికెట్ కీపర్ కమ్రాన్ సూచించాడు.ఈ ఏడాది ప్రారంభములో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్ చేయమంటూ తనను కలిసిన బుకీల సమాచారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకి అతను తెలపలేదు.కానీ ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో విచారణ జరిపిన పీసీబీ గత సోమవారం అన్ని […]
లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు సోషల్ మీడియాలో గత మ్యాచ్‌ల తాలూకు పలు సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. అదే కోవలో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఆసక్తికరమైన అంశాన్ని తెలియజేశాడు. మిస్టర్ కూల్ ధోనీ ఉత్కంఠభరిత సన్నివేశంలో కూడా తన భావోద్వేగాలను నియంత్రించు కుంటాడు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కి పాల్పడిన ఘటనలు లేవని చెప్పవచ్చు. అలాంటిది గత ఐపీఎల్ 2019 […]
ఐపీఎల్ ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ 50 మంది జ్యూరీ సభ్యుల అభిప్రాయాల ఆధారంగా వివిధ కేటగిరీలో అత్యుత్తమ ఆటగాళ్లని ఎంపిక చేసింది.ఉత్తమ కెప్టెన్ల విభాగములో ఐపీఎల్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్లుగా మహేంద్రసింగ్ ధోనీ,రోహిత్ శర్మ సంయుక్తంగా ఎంపికయ్యారు.మిస్టర్ కూల్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో ఆడిన 10 సీజన్లోనూ ప్లేఆఫ్ దశకు చేరుకొని మూడు సార్లు టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది.అలాగే రోహిత్ శర్మ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ టోర్నీ […]
2006-08 వరకు చీఫ్ సెలెక్టర్‌గా పని చేసిన వెంగ్‌సర్కార్ సెలెక్షన్ కమిటీకి ఉన్నత ప్రమాణాలను నిర్దేశించి తనదైన ముద్ర వేశాడు. కోహ్లీకి జట్టులో స్థానం కల్పించి మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా దిలీప్ వెంగ్‌సర్కార్ తన ప్రత్యేకతను చాటాడు. ప్రస్తుతం ఉనికిలో లేని బీసీసీఐ టాలెంట్ రీసెర్చ్ డెవల్‌పమెంట్ వింగ్ హెడ్‌గా విధులు నిర్వర్తించిన తాను ఆ అనుభవంతో యువ ఆటగాళ్లను ప్రోత్సహించి సెలెక్షన్ కమిటీ చైర్మన్ […]
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన అరుదైన టీ20 రికార్డ్‌కి విరాట్ కోహ్లీ 24 పరుగుల దూరంలో ఉన్నాడు.బుధవారం హామిల్టన్ లో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20లో విరాట్ కోహ్లీ 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో ధోనీ కెప్టెన్సీ పరుగుల రికార్డ్ బద్దలు కొట్టి భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ నిలవనున్నాడు.కెప్టెన్‌గా ధోనీ 62 ఇన్నింగ్స్ ఆడి 1,112 పరుగులు చేశాడు. 2017లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ కేవలం 34 […]
ధోని క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు అద్వితీయమైన,చారిత్రక విజయాలు అందించి, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు పొందాడు. కానీ ఇప్పుడు ధోనీ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే అన్న సంకేతాలు వస్తుండటంతో ధోనీ అభిమానులు నిరుత్సాహానికి లోనవుతున్నారు. గత కొన్ని రోజులుగా ధోని రిటైర్మెంట్ పై భారత క్రికెట్ అభిమానుల్లో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ధోనీ వచ్చే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ లో […]
డిసెంబర్ 23,2005 ఈరోజుకో ప్రత్యేకత ఉంది జార్ఖండ్ డైనమైట్ గా పేరుగాంచిన ధోని అంతర్జాతీయ వన్డేలలో అరంగేట్రం చేసిన రోజిది. బంగ్లాదేశ్ తో జరిగిన ఆ వన్డేలో ధోని అనవసర పరుగుకోసం ప్రయత్నించి డక్ అవుట్ గా వెనుదిరిగాడు కానీ తరువాతి రోజుల్లో హెలికాఫ్టర్ షాట్ల అనేక రికార్డ్స్ సాధించటంతోపాటు భారత్ కు ప్రపంచ కప్పుతో పాటు ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. యాధృచ్చికంగా జరిగింది లేక వేరే కారణాలతోనే కానీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగిడిన తరువాత ధోనీ […]