iDreamPost
android-app
ios-app

సినిమాల్లోకి ధోని..? నిర్మాతగా ఫస్ట్ మూవీ రిజల్ట్ రాకముందే నటుడిగా..

  • Author ajaykrishna Published - 10:38 AM, Mon - 24 July 23
  • Author ajaykrishna Published - 10:38 AM, Mon - 24 July 23
సినిమాల్లోకి ధోని..? నిర్మాతగా ఫస్ట్ మూవీ రిజల్ట్ రాకముందే నటుడిగా..

ఈ మధ్యకాలంలో సినిమాల్లోకి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో క్రికెటర్స్ ఇర్ఫాన్ పఠాన్, హార్భజన్ సింగ్ లాంటివారు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే బాటలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేంటీ.. ధోని ఆల్రెడీ ‘ఎల్ జి ఎం’ మూవీతో ప్రొడ్యూసర్ గా మారిపోయాడు కదా అనుకోవచ్చు. కానీ.. నేను చెప్తుంది ప్రొడక్షన్ గురించి కాదు. ధోని నిర్మాతగానే కాదు.. నటుడిగాను డెబ్యూకి రెడీ అయిపోయాడట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. ధోని ఆల్రెడీ.. ధోని ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి.. ‘లెట్స్ గెట్ మ్యారీడ్'(LGM) మూవీ నిర్మించాడు.

తమిళ హీరో హరీష్ కళ్యాణ్, ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా జంటగా నటించిన ఈ సినిమాని.. రమేష్ తమిళమణి తెరకెక్కించారు. ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ నెల 28న ఈ సినిమా తమిళ, తెలుగు భాషలలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కోలీవుడ్ లో గట్టిగానే గట్టిగానే ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమాకి.. తెలుగులో మాత్రం పెద్దగా చప్పుడు లేదని చెప్పాలి. పైగా ‘ఎల్.జి.ఎం’కి పోటీగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ రిలీజ్ అవుతోంది. మరి జీరో ప్రమోషన్స్ తో ధోని నిర్మించిన ఫస్ట్ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ నిర్మాతగా మారిన ధోని.. నటుడిగాను LGM మూవీతోనే డెబ్యూ చేయనున్నట్లు సమాచారం. ఇందులోనే చిన్న రోల్ లో ఎంట్రీ ఇస్తాడని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ధోని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom