Swetha
సంక్రాంతి రేస్ లో వస్తున్న రెండు పెద్ద సినిమాలలో మన శంకర వరప్రసాద్ గారు కూడా ఒకటి. సరిగ్గా పండుగకు ఓ రోజు ముందు వస్తుంది ఈ సినిమా. సినిమా సమయం దగ్గర పడుతుంది ఎప్పుడెప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ అంతా కళ్ళలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూసారు.
సంక్రాంతి రేస్ లో వస్తున్న రెండు పెద్ద సినిమాలలో మన శంకర వరప్రసాద్ గారు కూడా ఒకటి. సరిగ్గా పండుగకు ఓ రోజు ముందు వస్తుంది ఈ సినిమా. సినిమా సమయం దగ్గర పడుతుంది ఎప్పుడెప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ అంతా కళ్ళలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూసారు.
Swetha
సంక్రాంతి రేస్ లో వస్తున్న రెండు పెద్ద సినిమాలలో మన శంకర వరప్రసాద్ గారు కూడా ఒకటి. సరిగ్గా పండుగకు ఓ రోజు ముందు వస్తుంది ఈ సినిమా. సినిమా సమయం దగ్గర పడుతుంది ఎప్పుడెప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ అంతా కళ్ళలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూసారు. నిన్న సాయంత్రం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. జనరల్ గా అనిల్ రావిపూడి అంటే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా చెప్పుకుంటాం. ఈ సినిమాతో అది మరోసారి కచ్చితంగా ప్రూవ్ అవుతుందని చెప్పడంలో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఈ సినిమా ట్రైలర్ ను గమనిస్తే.. ఇందులో చిరంజీవికి ఇంటెలెజిన్స్ బ్యూరోలో పని చేసే ఓ ఆఫీసర్ . అప్పటికే అతనికి నయనతారతో ప్రేమ వివాహం అయ్యి ఉంటుంది. కానీ ఎందుకో ఆమెకు దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అతను చేసే వర్క్ నుంచి కూడా బ్రేక్ తీసుకుని మామూలు జీవితం గడుపుతూ ఉంటాడు. కట్ చేస్తే ప్రభుత్వానికి అతనితో పని పడుతుంది. అదే సమయంలో అతని ఫ్రెండ్ వెంకటేష్ కూడా ఎంట్రీ ఇస్తాడు. అసలు ఆ గవర్నమెంట్ ఆపరేషన్ ఏంటి ? వెంకీ ఎంట్రీ ఎందుకు ఉంది ? వరప్రసాద్ కుటుంబానికి దూరంగా ఎందుకు గడపాల్సి వస్తుంది ? చివరికి ఏమైంది అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
సినిమా మీద ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు ట్రైలర్ తో సెట్ అయ్యాయా అంటే.. ఇక్కడ వెంటనే ఎస్ చెప్పే పరిస్థితి లేదు. కానీ పోను పోను సినిమా మీద బజ్ పెరిగే అవకాశం లేకపోలేదు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈలోపు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.