iDreamPost
android-app
ios-app

ధోని సినిమా తెలుగులో రిలీజ్ కి రెడీ! ఇంతకీ తమిళ టాక్ ఏంటి?

  • Author ajaykrishna Published - 09:00 AM, Tue - 1 August 23
  • Author ajaykrishna Published - 09:00 AM, Tue - 1 August 23
ధోని సినిమా తెలుగులో రిలీజ్ కి రెడీ! ఇంతకీ తమిళ టాక్ ఏంటి?

క్రికెట్ లో ధోని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను స్టేడియంలో అడుగు పెడితే చాలు.. ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ.. సంబరాలు చేసుకుంటారు. అలాంటిది ధోని ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేస్తున్నాడంటే.. ఖచ్చితంగా సినిమా లవర్స్ కి ఇది సంతోషించదగ్గ విషయమే. ధోని ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని.. తొలి ప్రయత్నంగా ‘LGM'(లెట్స్ గెట్ మ్యారీడ్) అనే మూవీ నిర్మించిన సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు భాషలలో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా.. ట్రైలర్, సాంగ్స్ మోస్తరు అంచనాలు క్రియేట్ చేశాయి. ఫన్ తో పాటు లవ్, ఫ్యామిలీ కాన్సెప్ట్ తో LGM తెరపైకి వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ రమేష్ తమిళమణి ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఇక తమిళంలో గతవారమే విడుదలైన ఈ సినిమా.. మిక్సడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికి.. ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ తో ఉందని కోలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు. స్టోరీ పరంగా.. ఇండిపెండెంట్ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత.. అబ్బాయి తల్లితో ఉండటానికి ఇష్టపడకపోవడం.. తిరిగి ఆమెతో ఎలా బాండింగ్ పెంచుకొని ఫ్యామిలీకి దగ్గరైంది.. తన ప్రేమను ఎలా గెలుచుకుంది? ఫ్యామిలీ టూర్ ఎందుకు ప్లాన్ చేసింది? అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ట్రైలర్ చూస్తే స్టోరీలో కొత్తదనం కనిపించకపోయినా.. ఫన్ తో ఎంటర్టైన్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాని ధోని భార్య సాక్షి దగ్గరుండి మరి తమిళ, తెలుగు భాషలలో ప్రమోషన్స్ చేసింది. అయితే.. మొత్తానికి ఈ సినిమా తెలుగు రిలీజ్ కి రెడీ అయిపోయింది. తమిళంలో జులై 28న విడుదలైన ఈ సినిమా.. పాజిటివ్ మిక్సడ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక తెలుగు రిలీజ్ విషయానికి వస్తే.. ఆగష్టు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా.. ఇందులో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా నటించారు. నదియా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి డైరెక్టర్ రమేష్ తమిళమణినే స్వయంగా మ్యూజిక్ అందించడం విశేషం. మరి ధోని ప్రొడక్షన్ నుండి వస్తున్న ఫస్ట్ మూవీ.. LGM తెలుగులో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. మరి ఈ సినిమా కోసం మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom