Swetha
ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు ఏమి సింగిల్ పార్ట్ లో రావడం లేదు. సిక్వెల్స్ , ప్రిక్వెల్స్ అంటూ కథను లాగుతున్నారు. నిజంగా అక్కడ స్టోరీ ఉంటె పరవాలేదు కానీ ఏమి లేకుండా పార్ట్ 2 అంటుంటే .. జనాల్లో కూడా ఎక్కడో అది యాక్సెప్ట్ చేయడానికి కష్టంగానే ఉంటూ ఉంది. బాహుబలి తర్వా త ప్రభాస్ సినిమా అంటే అది సిక్వెల్ అని ఫిక్స్ అయిపోతున్నారు చాలా మంది.

ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు ఏమి సింగిల్ పార్ట్ లో రావడం లేదు. సిక్వెల్స్ , ప్రిక్వెల్స్ అంటూ కథను లాగుతున్నారు. నిజంగా అక్కడ స్టోరీ ఉంటె పరవాలేదు కానీ ఏమి లేకుండా పార్ట్ 2 అంటుంటే .. జనాల్లో కూడా ఎక్కడో అది యాక్సెప్ట్ చేయడానికి కష్టంగానే ఉంటూ ఉంది. బాహుబలి తర్వా త ప్రభాస్ సినిమా అంటే అది సిక్వెల్ అని ఫిక్స్ అయిపోతున్నారు చాలా మంది. ఇప్పటికే సలార్ , కల్కి సినిమాలకు సిక్వెల్స్ రెడీగా ఉన్నాయి. అలాగే రాబోయే ఫౌజీ కి కూడా సిక్వెల్ ఉంటుందనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు రాజాసాబ్ కు కూడా సిక్వెల్ ఉంటుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
దాని గురించి డైరెక్టర్ మారుతి ఓ క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్ ఓ జోకర్ షాట్ ఉంటుంది . అది పార్ట్ 2 కు లీడ్ కోసమే పెట్టాడట దర్శకుడు. కానీ ఇంకా ఆ పార్ట్ 2 కథ రెడీగా అయితే లేదట. ప్రస్తుతానికి లీడ్ ఇచ్చేసి.. తర్వాత పరిస్థితులకు తగ్గట్టు పార్ట్ 2 కథ ఉంటుందట. ఈ కథను సాగదీస్తారు అని భామలైతే పెట్టుకోవద్దని.. పార్ట్ 2 కు ప్రభాస్ రేంజ్ కు తగిన స్టోరీనే రెడీ చేస్తానని కూడా మారుతి హామీ ఇచ్చేసాడు. అలాగే గతంలో నిర్మాత టిజి విశ్వప్రసాద్ రాజాసాబ్ ఫ్రాంచైజ్ కొనసాగుతుందని చెప్పారు. ఒకవేళ ఏదైనా హర్రర్ ఫాంటసి సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారో ఏమో తెలియదు.
ప్రస్తుతానికైతే పార్ట్ 1 కి వచ్చే టాక్ ను బట్టి మారుతి సెకండ్ పార్ట్ ను రెడీ చేయబోతున్నాడని అర్ధమౌతుంది. సినిమా రిలీజ్ కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మూడు రోజుల్లో డార్లింగ్ ఫ్యాన్స్ ఎలాంటి హడావిడి చేస్తారో చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తాడా లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .