ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ 16న ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్‌తోపాటు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆప్ నేతలు పిలుపునిచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ […]
ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఈనేపధ్యంలో ఢిల్లీ పిసిసి ఇంచార్జ్ గా ఉన్న పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు వరుసగా 3 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరుస పరాభవాలు చవిచూస్తూ పరువు పోగొట్టుకుంటుంది. మాజీ సియం దివంగత నేత షీలా దీక్షిత్ హాయాంలోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని పీసీ చాకో విమర్శలు చేశారు. […]
ఢిల్లీలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అరవింద్ కేజ్రీవాల్ దక్కించుకోవడం చిన్న విషయం కాదు. మోడీ-షా కొలువై ఉన్న దేశ రాజధానిలో వరుసగా రెండోసారి ఆ జంటను మట్టికరిపించడంతో కేజ్రీవాల్ క్రేజ్ అమాతంగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. అపర ఛాణిక్యుడిగా అభిమానులు పిలుచుకునే అమిత్ షా ఎంతగా ప్రయత్నించినా అంతుచిక్కకుండా విజయబావుటా ఎగురువేసిన ఆప్ విజయ రహస్యంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సంక్షేమ పథకాలు, కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్, గుజరాత్-ఢిల్లీ మోడల్ అభివృద్ధిపై చర్చ అంటూ పలు […]
పార్టీలనగానే ఎవరి విధానాలు వారికుంటాయి. ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతిమంగా ప్రజల అభిమానాన్ని సంపాదించిన వారికే విజయం దక్కుతుంది. అయితే ఢిల్లీ ఎన్నికల ప్రచారం, ఫలితాలు గమనిస్తే ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనివ్వకుండా ప్రతీ సారి భావోద్వేగం రాజేస్తామనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పక తప్పదనే విషయం బోధపడుతుంది. ఎన్నికల్లో ప్రజల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే వారి మనసులు గెలుచుకుకోవడం సాధ్యం కాదనే విషయం ప్రస్ఫుటం అయ్యింది. కేజ్రీవాల్ విజయంలో ప్రజానుకూల […]
ఢిల్లీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో అని టెన్షన్ తో టీవీ చూడటం మొదలుపెట్టింది దేవి.. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినట్లు AAP అధికారంలోకి వస్తుందా ? లేక “మోషా”మ్యాజిక్ తో బీజేపీ అధికారంలోకి వస్తుందా అన్న ఆలోచన దేవి మనసులో తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో AAP ఘన విజయం సాధించింది.. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. దాంతో నాయకులు ఢిల్లీ ఎన్నికల విషయంలో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఒక్కొక్కరికి వాట్సాప్ లో మెసేజ్ చేసింది […]
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి ఎలాగైనా అధికారంలోకి కైవసం చేసుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ ఈరోజు విడుదలౌతున్న ఫలితాలలో AAP భారీ మెజారిటీతో విజయం సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా ఒక్కసారిగా తమ స్వరాన్నిపెంచాయి. తాజాగా బిజెపి ఓటమి రూపంలో మోడీపైనా పోరాడడానికి కాంగ్రెసేతర విపక్షాల చేతికి ఆయుధం దొరికినట్టయింది. ఈనేపథ్యంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఉదయం […]
ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం ఏడు సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి తన స్థానాలను స్వల్పంగా పెంచుకుంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ బీజేపీ దాదాపు 15 నుంచి 20 స్థానాల మధ్య ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. ఒకానొక దశలో ఆప్, బీజేపీ మధ్య 27 స్థానాల్లో హోరా హోరీ […]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో న్యూ ఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీ వాల్ మూడవసారి విజయం సాధించారు. భారీ విజయంతో ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా AAP పార్టీ ఎన్నికల ఫలితాలలో ముందుకు దూసుకు పోతుంది.. ఇప్పటికే 25 స్థానాల్లో విజయం సాధించిన AAP మరో 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. న్యూఢిల్లీ నియోజక వర్గం నుండి 13,508 ఓట్ల తేడాతో హ్యాట్రిక్ విజయం సాధించారు. భాజపా పార్టీ రెండు స్థానాలు కైవసం చేసుకుని మరో పది స్థానాల్లో […]
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో కాషాయి జెండా ఎగురువేయాలన్న బీజేపీ ఆశలు ఈ సారి కూడా అడియాశలైయ్యాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలకు చెక్ పెడుతూ.. రికార్డు మెజారిటీతో 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అదే ఒరవడిని కొనసాగిస్తూ 2019లోనూ బీజేపీ ఘన విజయం సాధించి.. ప్రధానిగా మోదీ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. 2013, 2015 ఎన్నికల్లో ఢిల్లీలో గెలుపు బావుటా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కేజ్రీవాల్ రూపంలో బీజేపీకి పెద్ద […]
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దూసుకెళుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం నుంచీ ఆప్ స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం మొత్తం 70 స్థానాల్లో రెండు మూడు రౌండ్లు ముగిసే నాటికి మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ అభ్యర్థులు 53 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో ప్రధాన పక్షం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంలో […]