మరి కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు వరాల జల్లు కురిపిస్తుంది కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన సంగతి విదితమే. ఇప్పుడు అంగన్ వాడీలకు శుభవార్త తెలిపింది. కనీస వేతనం పాతిక వేలకు పెంచాలని, ఉద్యోగ క్రమబద్దీకరణ, పని భారం తగ్గింపు వంటి డిమాండ్లతో అంగన్ వాడీలు ఇటీవల రోడ్లెక్కిన సంగతి విదితమే. ఇప్పుడు వారి ఆగ్రహ జ్వాలలను చల్లార్చేందుకు ఉపక్రమించింది బీఆర్ఎస్ […]
గత కొన్ని రోజులుగా వాతావరణంలో విభిన్నమైన మార్పులు సంభవించాయి. ఓ వైపు ఎండలు, మరో వైపు వర్షాలు. ఈ క్రమంలోనే వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రభలుతున్నాయి. దీంతో రాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాసుపత్తుల్లో అవసరమైన మందులు, వైద్యులను అందుబాటులో ఉంచుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం వైరల్ ఫీవర్ భారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం డాక్టర్లు వైద్యం […]
వైద్య రంగంపై ఇప్పుడు ఫోకస్ పెరుగుతోంది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడాల్లేకుండా చాలా రాష్ట్రాలు ఇప్పుడు దీనిపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు కూడా వైద్య రంగానికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణం, ఆధునికీకరణ లాంటి పనులు చేపట్టారు. అలాగే ఉచితంగా డయాలసిస్ సేవలు, వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలోని పేద రోగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో […]
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్ని రకాలుగా సిద్దమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ తాము చేపట్టిన అభివృద్ది పనులు, అమల్లోకి తీసుకువచ్చిన పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే వచ్చే బీఆర్ఎస్ తరుపు నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక […]
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతల్ని టార్గెట్ చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. స్కామ్‌లకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులు డబ్బులు బాగా సంపాదించి, వాటితో ఓట్లు కొనాలనుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. హస్తం పార్టీ నేతలు డబ్బులిస్తే తీసుకోవాలని.. ఓట్లు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఓటర్లకు సూచించారు. భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ బీఆర్ఎస్లో చేరగా.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి […]
సీఎం కేసీఆర్ పాఠశాల విద్యార్థులకు శుభవార్తను అందించారు. వారి కోసం ఓ వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెడుతూ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు ఆ విధమైన కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికి అవసరమైన నిధులను కేటాయిస్తూ ఖర్చుచేస్తుంది. పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. […]
టీఎస్ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకు కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ పలు సంస్కరణలను చేపట్టింది. దీనిలో భాగంగానే టీఎస్ఆర్టీసీ కార్మికులను, సంస్థలో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునేలా బిల్లును రూపొందించింది. కాగా ఈ బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపించగా కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉంది. తాజాగా ఈ విలీనం బిల్లుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో సంస్థలో […]
హైదరాబాద్ వాసులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 21వ తేదీన రెండో దశలో దాదాపు మరో 13,300 ఇండ్లను పేదలకు అందజేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై సచివాలయంలో […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా.. రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ నాలుగేళ్లు గవర్నర్‌గా తన మీద రాష్ట్ర ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానానికి తమిళిసై కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలతో పాటు సీఎం కేసీఆర్‌పై ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎక్కడ ఉన్నప్పటికీ తెలంగాణతో బంధాన్ని మాత్రం మర్చిపోనన్నారామె. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ […]
రాష్ట్రంలో చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రతి నెల వారి ఖాతాల్లో రూ. 3వేలు జమ చేయనున్నది. దీనిలో బాగంగా మొదటిసారిగా చేనేతమిత్ర పథకం కింద అర్హులైన చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.3 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జమ చేసింది. ఎన్నో ఏండ్ల నుంచి చేనేత వృత్తిపై ఆదారపడిన వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో చేతినిండా పని లేక, సరైన ముడి సరుకులు […]