Swetha
సరైన కంటెంట్ ఉన్న సినిమా థియేటర్ లో పడాలే కానీ.. ప్రత్యేకించి మూవీ టీమ్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమాటిక్ గా మొదటి షో తర్వాత ఆడియన్స్ ఏ ఆ సినిమాను ప్రమోట్ చేస్తారు. పీక్ సమ్మర్ సీజన్ అయ్యి ఉండి కూడా థియేటర్ ఓనర్స్ ఈసారి నష్టాలను చవి చూశారు.
సరైన కంటెంట్ ఉన్న సినిమా థియేటర్ లో పడాలే కానీ.. ప్రత్యేకించి మూవీ టీమ్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమాటిక్ గా మొదటి షో తర్వాత ఆడియన్స్ ఏ ఆ సినిమాను ప్రమోట్ చేస్తారు. పీక్ సమ్మర్ సీజన్ అయ్యి ఉండి కూడా థియేటర్ ఓనర్స్ ఈసారి నష్టాలను చవి చూశారు.
Swetha
సరైన కంటెంట్ ఉన్న సినిమా థియేటర్ లో పడాలే కానీ.. ప్రత్యేకించి మూవీ టీమ్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమాటిక్ గా మొదటి షో తర్వాత ఆడియన్స్ ఏ ఆ సినిమాను ప్రమోట్ చేస్తారు. పీక్ సమ్మర్ సీజన్ అయ్యి ఉండి కూడా థియేటర్ ఓనర్స్ ఈసారి నష్టాలను చవి చూశారు. శేఖర్ కమ్ముల పుణ్యమా అని కుభేరతో భారీ ఓపెనింగ్స్ మొదలయ్యాయి. దానిని ఉపకమింగ్ సినిమాలు కొనసాగిస్థాయని అనుకున్నారు. కానీ అవి వీకెండ్స్ వరకే సరిపెట్టాయి. వీక్ డేస్ స్టార్ట్ అయ్యాక అమాంతం లెక్కలు మారిపోయాయి. ఇక ఇప్పుడు మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ లో బడా హీరోలతో భారీ బెట్టింగ్ జరగబోతుంది.
జూలై 15 మొదలుకుని ఆగస్టు 15 వరకు ఈ మధ్యలో నాలుగు భారీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. హరి హర వీరమల్లు , కింగ్డమ్ , వార్ 2 , కూలీ సినిమాలు ఇలా వరుసగా రిలీజ్ కానున్నాయి. నాలుగు సినిమాల మీద మొత్తంగా ఏడు వందల కోట్ల రూపాయలను బిజినెస్ జరగనుంది. హరి హర వీరమల్లు సినిమా గురించి ఎలాంటి వార్తలు వస్తూ ఉన్నా.. సినిమా బిజినెస్ విషయంలో మాత్రం ఎంత లేదన్న 200 కోట్ల వరకు పలకనుంది. ఇక ఆ తర్వాత కింగ్డమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 కోట్ల వరకు థియేటర్ హక్కులను ఇచ్చారు. అలా వార్ 2 కు 80 కోట్లు , కూలి సినిమాకు 44 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.
అంటే ఓవరాల్ గా నాలుగు సినిమాలు కలిపి దగ్గర దగ్గర 700 కోట్ల గ్రాస్ , 300 నుంచి 350 వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే హరి హర వీరమల్లు , కింగ్డమ్ సినిమాల మధ్య మాత్రం చాలా తక్కువ గ్యాప్ ఉంది. సో ఇక్కడ లెక్కలు కాస్త తారు మారు అయ్యే అవకాశం ఉంది. ఇక ఈసారి ఏ సినిమాకు అదృష్టం వరిస్తుందో. ఏ సినిమా బాక్స్ ఆఫీస్ కా బాప్ అనిపించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.