iDreamPost
android-app
ios-app

తెల్లరేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వారందరికి రూ.5 లక్షలు

  • Published Oct 16, 2023 | 12:12 PM Updated Updated Oct 16, 2023 | 12:12 PM
  • Published Oct 16, 2023 | 12:12 PMUpdated Oct 16, 2023 | 12:12 PM
తెల్లరేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్..  వారందరికి రూ.5 లక్షలు

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా.. నిన్న తెలంగాణ భవన్ లో బీ-ఫారాలు అందజేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార పార్టీకి రెండు సార్లు పట్టం కట్టారంటే.. మనం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు అని.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటేనే గెలిపిస్తారని అభ్యర్థులకు సూచించారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేశారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా వరాల జల్లు కురిపించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సామాన్యులపై వరాల జల్లు కురిపించారు. గతంలో కొనసాగించిన పథకాలను కంటిన్యూ చేస్తూ.. ఈసారి సరికొత్త పథకాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రైతుంబంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే కొత్త హామీలతో తెలంగాణ ప్రజలకు ఎంతో లబ్ది చేకూరుతుందని వివరించారు. రైతు బీమా తరహాలో తెల్ల రేషన్ కార్డుదారులకు బీమా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎల్ ఐసీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టి పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే తమ లక్ష్యం అని భరోసా కల్పించారు. ఈ బీమా పథకం ద్వారా పేద ప్రజలకు 5 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. గతంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల ప్రజలు లబ్దిపొందారు.. వారి ఆశీర్వాదం వల్లనే తాము అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు.

మూడోసారి తాము అధికారంలోకి వస్తే పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్న తెల్లరేషన్ కార్డుదారులకు కేసీఆర్ బీమా చేయిస్తామని.. 93 లక్షల కుటుంబాలకు ఈ బీమా ద్వారా లబ్ది చేకూరుతుందని అన్నారు. ‘కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా’ అని అభివర్ణించారు. అంతేకాదు తెల్ల రేషన్ కార్డుదారులకు ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం కింద సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇక నుంచి పేదవాళ్లు దొడ్డు బియ్యం తినాల్సిన అవసరం లేదు అని అన్నారు. అంతేకాదు తెలంగాణలో ‘సౌభాగ్యలక్ష్మి పథకం’ ద్వారా బీపీఎల్ కార్డులు ఉన్న మహిళలకు ప్రతినెల రూ.3 వేల జీవన భృతి అందిస్తామని భరోసా ఇచ్చారు.