P Krishna
తెలంగాణలో ఈ నెల 30 న ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలు వరుస ప్రచారాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో ఈ నెల 30 న ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలు వరుస ప్రచారాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
P Krishna
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వా.. నేనా అన్న విధంగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ నెల 3 న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లతో బిజీగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కి ముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం విడదలవారీగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 30న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించి.. ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకునేందుకు అధికార పార్టీ గట్టి పట్టుమీదే ఉంది. ఈసారి అధికార పార్టీని గద్దె దింపి తాము అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరుసగా ప్రచారాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలంపూర్ అసెంబ్లీ కి బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చారు. గతంలో ఇక్కడ అబ్రహం పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్ దాఖలు కి మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో కేసీఆర్ అలంపూర్ అభ్యర్థిని మార్చాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అబ్రహంను తప్పించి విజయుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాగా, అబ్రహం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా తన అరుచరుడైన విజయుడికి టిక్కెట్ ఇప్పించుకోవడానికి చల్లా వెంకట్రామిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.