iDreamPost
android-app
ios-app

కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి ఆర్థిక సాయం అందించేందుకు మరో కొత్త పథకం

కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి ఆర్థిక సాయం అందించేందుకు మరో కొత్త పథకం

అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకుని వారికి అండగా నిలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే అన్ని రంగాల్లో దూసుకెళ్తూ దేశానికే రోల్ మోడల్ గా అవతరించింది. రైతు బంధు, దళిత బంధు, బీసీ లోన్స్, మైనార్టీ లోన్స్ వంటి పథకాలతో సాయమందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ ప్రభుత్వం ఎరుకలకు శుభవార్తను అందించింది. వారి సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. పందుల పెంపకం సొసైటీలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.60 కోట్ల రూపాయల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రకటించింది. ట్రైకార్‌ ద్వారా సాధికారత పథకాన్ని ప్రభుత్వం అమలు పరుచనున్నది. పందుల పెంపకం, స్లాటర్‌ హౌస్‌, కోల్డ్‌ స్టోరేజీలకు, రవాణా, ఫోర్క్‌ రిటైల్‌ మార్కెట్ల ఏర్పాటు కోసం ఆర్థిక సాయం అందించనున్నది.

యూనిట్‌కు గరిష్ఠంగా రూ.30లక్షల వరకు 50శాతం సబ్సిడీ ఇవ్వనున్నది. 40శాతం బ్యాంకు రుణం, మరో పదిశాతం 10శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. పథకం మంజూరు కోసం జిల్లాస్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ పని చేయనుండగా.. ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ రాష్ట్రస్థాయిలో పథకం అమలును పర్యవేక్షించనున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎరుకల సామాజిక వర్గం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.