iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. ఇక ఆసరా పెన్షన్ రూ.6 వేలు!

  • Published Oct 16, 2023 | 12:08 PM Updated Updated Oct 16, 2023 | 12:19 PM
  • Published Oct 16, 2023 | 12:08 PMUpdated Oct 16, 2023 | 12:19 PM
గుడ్ న్యూస్.. ఇక ఆసరా పెన్షన్ రూ.6 వేలు!

తెలంగాణలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. నిన్న ఆదివారం హుస్నాబాద్ నుంచి ఆయన ప్రచార శంకారాన్ని పూరించారు. అంతకు ముందు తెలంగాణ భవన్ లో ఎన్నికల మేనిఫెస్టో మీడీయా సమావేశంలో విడుదల చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈసారి హ్యాట్రిక్‌ లక్ష్యంగా బీఆర్ఎస్ సంక్షేమ మేనిఫెస్టోను రూపొందించినట్లు కనిపిస్తుంది. గతంలో అమలు చేసిన కొన్ని స్కీములు అమలు చేస్తూ.. నూతనంగా మరికొన్ని పథకాలు అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. మొత్తానికి ఈ మేనిఫెస్టోతో సామాన్యులపై ఎన్నో వరాల జల్లులు కురిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఈ క్రమంలో ఆసరా పింఛన్ దారులకు గొప్ప శుభవార్త తెలిపారు. ఇకపై ఆసరా పింఛన్లను పెంచనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆసరా పింఛన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబ్ది పొందుతున్నారు. మొదట రూ.1000 చేశాం.. దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం రూ.2016 ఇస్తున్నామని దీన్ని రూ.3 వేలకు పెంచుతామని ప్రకటించారు. అంతేకాదు ప్రతి ఏడాది రూ.500 పెంచుకుంటూ ఐదో ఏడాది నాటికి రూ.5 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వంపై ఒకేసారి భారం పడకుండా ఉంటుందని అన్నారు. అలాగే దివ్యాంగుల పింఛన్ ఇటీవలే రూ.4 వేలకు చేశామని.. ఈ పింఛన్ కూడా రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత దివ్యాంగుల పింఛన్ రూ.5 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదికి రూ.300 వందలు పెంచుకుంటూ వెళ్తు రూ.6 వేలు చేస్తామని అన్నారు.

ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్లు అనే విధానం ఈ భవనంలోనే పుట్టింది.. సంక్షేమ పథకాల అమలు గురించి చర్చలు నడుస్తున్న సమయంలోనే రెండు గంటల పాటు ఈ స్కీమ్ గురించి చర్చించాం.. ఆసరా పెన్షన్లకు బీఆర్ఎస్ కొత్త రూపం తీసుకు వచ్చింది. అప్పట్లో పదులు, వందల రూపాయాల్లో ఉన్న ఈ స్కీమ్ ను ఒకేసాని వేల రూపాయలకు తీసుకువెళ్లాం. తమ ప్రభుత్వం వస్తే.. ఆసరా పెన్షన్ మార్చి తర్వాత రూ.3 వేలు చేసి.. రూ.6 వేల వరకు పెంచుతాం. తెలంగాణ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాం.. ఇకపై కాపాడుతామని హామీ ఇస్తున్నాం’ అని అన్నారు.