మామూలుగా వివాదాస్పద సినిమాలకు సంబంధించి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. నలభై ఏళ్ళ క్రితం బొబ్బిలి పులికి సర్టిఫికెట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తే ఎన్టీఆర్, దాసరి నారాయణరావులు ఢిల్లీ దాకా వెళ్లి పోరాడి క్లియరెన్స్ తెచ్చుకుని రిలీజ్ చేసేందుకు నానా కష్టాలు పడ్డారు. ఆర్ నారాయణమూర్తి దర్శకుడిగా తొలి చిత్రం అర్ధరాత్రి స్వతంత్రానికి ఇలాగే జరిగితే నటులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సహాయంతో దీని మీద పీపుల్స్ స్టార్ పెద్ద పోరాటమే […]
కేంద్ర ప్రభుత్వం సినిమాల మీద కొత్తగా తీసుకురాబోయే ఆంక్షలకు సంబందించిన చట్టాల మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే తమిళ హిందీ నటులు దీని మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయగా పూర్తిగా అవగాహన లేని కారణంగా మనవాళ్ళూ ఇంకా స్పందించలేకపోతున్నారు. సెన్సార్ జరిగిన సినిమాని లేదా జరగబోయే చిత్రాన్ని ఏ దశలో అయినా ఆపగలిగే లేదా పూర్తిగా నిషేధించే లేదా పలురకాల ఆంక్షలను విధించేలా రూపొందిన చట్టం గురించి ఇప్పటికే తీవ్ర స్థాయిలో చర్చలు […]