iDreamPost
android-app
ios-app

విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్రం.. తప్పు చేశారని తేలితే..!

  • Author singhj Published - 01:26 PM, Sat - 30 September 23
  • Author singhj Published - 01:26 PM, Sat - 30 September 23
విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్రం.. తప్పు చేశారని తేలితే..!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్​సీ) ముంబై ఆఫీసులో అవినీతి జరిగిందంటూ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను నటించిన ‘మార్క్ ఆంటోనీ’ మూవీ హిందీ వెర్షన్​ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు లంచం తీసుకుందంటూ పక్కా ఆధారాలతో సహా ఆయన వీడియో విడుదల చేశారు. ఈ అవినీతిని తాను జీర్ణించుకోలేకపోతున్నానంటూ విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండేతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఒక స్టార్ హీరో సెన్సార్ బోర్డుపై ఇలా కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

విశాల్ ఆరోపణలపై తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమని తెలిపింది. ‘సీబీఎఫ్​సీలో జరిగిన అవినీతి మీద విశాల్ బయటపెట్టిన అంశం దురదృష్టకరం. దీనిపై విచారణ జరిపేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్​ను వెంటనే ముంబైకి పంపాం. ఒకవేళ తప్పు జరిగినట్లే తేలితే శిక్ష తప్పదు. అప్పటిదాకా ప్రతి ఒక్కరూ ప్రసార మంత్రిత్వ శాఖకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సీబీఎఫ్​సీ వేధింపులకు సంబంధించిన సమాచారం ఉంటే మాకు ఇవ్వండి’ అని ట్విట్టర్​లో ప్రసార మంత్రిత్వ శాఖ ఒక పోస్ట్ పెట్టింది. విశాల్ ఆరోపణలకు రియాక్షన్​గా సమాచార, మంత్రిత్వ శాఖ ట్వీట్ చేయడం​ మీద బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్​లు స్పందించాయి.

ముంబై సెన్సార్ బోర్డులో ఎప్పుడూ తమకు ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు తెలిపాయి. సీబీఎఫ్​సీ-ప్రసార, మంత్రిత్వ శాఖ రెండింటితోనూ తమకు సత్సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్​కు చెందిన నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్​టైన్​మెంట్ పేర్కొంది. మా మొదటి సినిమా ‘దిల్ చాహ్​తా హై’ నుంచి ఇటీవలి ‘ఫక్రే 3’ దాకా ఎలాంటి ఇబ్బందులు, అవినీతి కానీ ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది. సెన్సార్ బోర్డు పూర్తి నిబద్ధత, పారదర్శకతతో పనిచేస్తోందని వివరించింది. అయితే ఈ విషయంలో నెటిజన్స్ నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్​ మీద ఎలాంటి కామెంట్ చేసినా వాళ్లు తట్టుకోలేరని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నటి హరితే విడాకులంటూ వార్తలు!