iDreamPost
android-app
ios-app

‘లియో’ ట్రైలర్ ఎఫెక్ట్.. థియేటర్లకు లీగల్ నోటీసులు పంపిన సెన్సార్ బోర్డ్!

  • Author Soma Sekhar Published - 01:43 PM, Tue - 10 October 23
  • Author Soma Sekhar Published - 01:43 PM, Tue - 10 October 23
‘లియో’ ట్రైలర్ ఎఫెక్ట్.. థియేటర్లకు లీగల్ నోటీసులు పంపిన సెన్సార్ బోర్డ్!

దళపతి విజయ్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘లియో’. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ మూవీ ట్రైలర్ ను ప్రదర్శించిన కొన్ని థియేటర్లకు సెన్సార్ బోర్డ్ లీగల్ నోటీసులు పంపించింది. ఇందుకు సంబంధించిన నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేంటి? ట్రైలర్ ను ప్రదర్శిస్తే లీగల్ నోటీసులు ఎందుకు పంపుతారు? అన్ని సినిమా ట్రైలర్లు థియేటర్లలో ప్రదర్శిస్తారు కదా? అని మీకు అనుమానం రావొచ్చు. లియో ట్రైలర్ విషయంలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

‘లియో’ దళపతి విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను అక్టోబర్ 5న రిలీజ్ చేసింది చిత్ర బృందం. చెన్నైలోని కొన్ని థియేటర్లలో సైతం ఈ ట్రైలర్ ను ప్రదర్శించారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. సెన్సార్ కట్ లేకుండానే సదరు థియేటర్లు ఈ ట్రైలర్ ను ప్రదర్శించారు. దీంతో అభ్యంతరకర పదాలతో ట్రైలర్ చూపించారంటూ.. సెన్సార్ బోర్డ్ ఆ థియేటర్లకు లీగల్ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం ఇలాంటి ట్రైలర్లను పబ్లిక్ లో ప్రదర్శించకూడదని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని సదరు థియేటర్ల యాజమాన్యాన్ని కోరింది.

ప్రస్తుతం లియో ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. అతి తక్కువ టైమ్ లోనే ఎక్కువ వ్యూస్ సాధించిన కోలీవుడ్ ట్రైలర్ గా రికార్డులను సృష్టిస్తోంది. కాగా.. ట్రైలర్ లో వచ్చిన అభ్యంతరకర పదాల గురించి వివరణ ఇచ్చాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఆ సన్నివేశాల్లో ఆ డైలాగ్స్ లేకపోతే ఎమోషన్ పండదని అందుకే వాటిని ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన లియో అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో విజయ్ కి జోడీగా త్రిష నటించనుండగా.. సంజయ్ దత్,గౌతమ్ మేనన్, మిస్కిన్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.