iDreamPost
android-app
ios-app

‘లియో’ సాంగ్ పై సెన్సార్ కొరడా! షాక్ లో విజయ్ ఫ్యాన్స్!

  • Author ajaykrishna Updated - 01:12 PM, Mon - 11 September 23
  • Author ajaykrishna Updated - 01:12 PM, Mon - 11 September 23
‘లియో’ సాంగ్ పై సెన్సార్ కొరడా! షాక్ లో విజయ్ ఫ్యాన్స్!

ఇండస్ట్రీలో సినిమాలకు సెన్సార్ బోర్డు షాకిచ్చింది అని రెగ్యులర్ గా వింటుంటాం. కానీ.. అప్పుడప్పుడు సినిమాలలోని సన్నివేశాలకే కాదు.. పాటలలో లిరిక్స్ కి కూడా సెన్సార్ షాకులు తగులుతుంటాయి. తాజాగా అలాంటిదే మోస్ట్ అవెయిటింగ్ మూవీకి జరిగిందట. దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘లియో’. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. లోకి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లియో వస్తుంది. ఇదివరకు విజయ్, లోకేష్ కాంబోలో మాస్టర్ సినిమా రూపొంది మంచి విజయం సాధించింది.

ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. తన ప్రతీ సినిమాపై ఆసక్తి రేపుతూ వస్తున్నాడు. ఇప్పుడు అదే బాటలో లియో తెరకెక్కించాడు. గతేడాది విక్రమ్ తో కమల్ హాసన్ ని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందించిన లోకేష్.. ఇప్పుడీ లియోని తెరకెక్కించే సరికి అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. అయితే.. ఇప్పటికే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న లియో.. అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా.. సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా ‘నా రెడీ’ అనే సాంగ్ తో ప్రారంభించారు మేకర్స్.

ఇప్పుడు అదే సాంగ్ విషయంలో సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. లియో మూవీలోని నా రెడీ సాంగ్ లో కొన్ని లిరిక్స్ విషయంలో అభ్యంతరం తెలిపిందట సెన్సార్. సాంగ్ లో ఆ లిరిక్స్ అనవసరం అని సెన్సార్ పేర్కొన్నట్లు కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నా రెడీ సాంగ్ నుండి సెన్సార్ బోర్డు తొలగించిన లిరిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ విషయంలో దర్శకుడు లోకేష్, మిగతా టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సెన్సార్ అభ్యంతరం తెలిపిన లిరిక్స్ ప్లేస్ లో కొత్త లైన్స్ యాడ్ చేస్తారేమో చూడాలి. కాగా.. ఈ పాటను స్వయంగా విజయ్ ఆలపించాడు. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom