iDreamPost
android-app
ios-app

విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం!

  • Published Oct 05, 2023 | 11:38 AM Updated Updated Oct 05, 2023 | 11:38 AM
  • Published Oct 05, 2023 | 11:38 AMUpdated Oct 05, 2023 | 11:38 AM
విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం!

కోలీవుడ్ హీరో విశాల్ కి తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. విశాల్ అసలు పేరు విశాల్ కృష్ణ రెడ్డి. ప్రముఖ సినీ నిర్మాత జీ.కె.రెడ్డి తనయుడు. వాస్తవానికి విశాల్ ది మాతృభాష తెలుగు అయినప్పటికీ.. తమిళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. 2004లో చెల్లమే అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇటీవల మార్క్ ఆంటోనీ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల తన మూవీ రిలీజ్ కావడానికి సెన్సార్ బోర్డు వారికి లంచం ఇచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సెన్సార్ బోర్డ్ కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..

హీరో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’తో సక్సెస్ అందుకొని మంచి సంతోషంలో ఉన్నాడు. ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటించారు.  పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన మార్క్ ఆంటోనీ కలెక్షన్లు కూడా బాగా సాధించింది. ఈ మూవీ సౌత్ లో సెప్టెంబర్ 15న రిలీజ్ కాగా, బాలీవుడ్ లో సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత హీరో విశాల్ సెన్సార్ బోర్డ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మూవీ రిలీజ్ చేయడానికి ముంబై ఆఫీస్ వారు 6.5 లక్షల లంచం తీసుకున్నారని ట్విట్ చేశారు. ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.

విశాల్ చేసిన ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ అత్యవసర బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విశాల్ కు లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డు సభ్యులు కాదని, ఆయన నుంచి డబ్బులు డిమాండ్ చేసింది థర్డ్ పార్టీ వారని సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఈ విషయంపై న్యాయ విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాదు ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఆన్‌లైన్ లోనే సినిమా సెన్సార్ ప్రక్రియ కంప్లీట్ చేసే యోచనలో ఉన్నట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఇందు కోసం ఈ – సినీ ప్రమాన్ లో దర్శక, నిర్మాతలు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. ఇక నుంచి నిబంధనల ప్రకారం ఆన్ లైన్ లో సెన్సార్ కోసం ధరఖాస్తు చేసుకోవాలని సెన్సార్ బోర్డు తెలిపింది.