iDreamPost
android-app
ios-app

Movies Postponement : వాయిదాల చెలగాటం – బాక్సాఫీస్ ప్రాణసంకటం

Movies Postponement : వాయిదాల చెలగాటం – బాక్సాఫీస్ ప్రాణసంకటం

ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా అనూహ్య ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న రాత్రి యుట్యూబ్ లో ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వదిలేంత వరకు జనవరి 7 అని చెప్పుకుంటూ వచ్చిన రాజమౌళి టీమ్ ఇప్పుడు వెనుకడుగు వేయక తప్పని పరిస్థితి నెలకొంది. యుఎస్ లో కేసుల పెరుగుదల, మన దేశంలో చాలా చోట్ల మొదలైన కఠిన ఆంక్షలు పాన్ ఇండియా సినిమాకు అడ్డంకిగా మారాయి. భీమ్లా నాయక్ తిరిగి 12న వచ్చే అవకాశాల గురించి తీవ్ర చర్చల్లో ఉంది. త్రివిక్రమ్, నాగవంశీ, చినబాబులు ఈ విషయంగానే సీరియస్ డిస్కషన్ చేస్తున్నారట. విదేశాల్లో ఉన్న పవన్ తో కంటిన్యూ గా వీడియో కాల్స్ జరుగుతున్నాయని వినికిడి.

ఇది వచ్చినా రాకపోయినా బంగార్రాజు మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఇందాకే టీజర్ వచ్చింది. పరిణామాలు చకచకా మారిపోవడంతో 15కి బదులు ఇంకా ముందే రావాలన్న ఉద్దేశంతో ఆ వీడియోలో డేట్ ని చెప్పకుండా థిస్ సంక్రాంతి అన్నారు అంతే. ఇంకో రెండు మూడు రోజుల్లో దీనికి సంబందించిన క్లారిటీ రావొచ్చు. దీంతో పాటు దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ ని పండగ బరిలో దించాలనే నిర్ణయం జరిగిపోయిందట. దీని ఫస్ట్ కాపీ ఎప్పుడో సిద్ధంగా ఉంది . సరైన డేట్ దొరక్క రెండు నెలల నుంచి వెయిటింగ్ లో ఉంచారు. ఇప్పుడు మంచి అవకాశం దొరకడంతో చకచకా పనులు పూర్తి చేసుకుని విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది.

ఇక రాధే శ్యామ్ సంగతి తేలాల్సి ఉంది. ఇంత ప్రతికూలమైన వాతావరణంలో యువి రిస్క్ చేస్తుందా లేదా అనేది సస్పెన్స్. ఇప్పటికైతే డేట్ లో ఎలాంటి మార్పు లేదు. కానీ ఎవరూ మాట మీద నిలబడతారన్న గ్యారెంటీ లేదు. అందుకే వేచి చూస్తే కానీ స్పష్టత రాదు.ఈ మొత్తం ఇష్యూ లో లాభపడేది ఖచ్చితంగా నాగార్జుననే. ఎందుకంటే బంగార్రాజు పాన్ ఇండియా మూవీ కాదు. తెలుగు రాష్ట్రాల వరకు సోగ్గాడే చిన్ని నాయనా రేంజ్ లో ఆడినా చాలు ఈజీగా ఓ డెబ్భై ఎనభై కోట్ల గ్రాస్ ని లాగేయొచ్చు. ఒకవేళ రాధే శ్యామ్ కూడా తప్పుకుంటే ఎంత లేదన్నా ఇంకో ఇరవై ముప్పై కోట్లు అదనంగా వచ్చి పడతాయి. చూద్దాం ఏం జరగబోతోందో

Also Read : RRR Postponed : అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి బృందం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి