iDreamPost
iDreamPost
ఇవాళ భీమ్లా నాయక్ వాయిదా ప్రకటన తర్వాత ఇప్పుడు అందరి చూపు బంగార్రాజు మీదకు వెళ్తోంది. ఇది కూడా పోస్ట్ పోన్ అవుతుందేమోనని అభిమానుల్లో అనుమానం మొదలైంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్ లో అసలు దీని ఊసు కూడా రాలేదు సరికదా ఎప్పుడో ఏప్రిల్ 1 వచ్చే సర్కారు వారి పాట గురించి దిల్ రాజు ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఇప్పుడు నాగార్జున ఏం చేయబోతున్నారనే ప్రశ్న తలెత్తడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బంగార్రాజు ముందు నుంచి చెబుతున్నట్టుగా జనవరి 15నే వస్తుందట. అప్పటికి ఆర్ఆర్ఆర్ వచ్చి ఎనిమిది రోజులు అవుతుంది. 14 రాధే శ్యామ్ ఉన్నప్పటికీ తనకూ థియేటర్లు ఉంటాయనేది నాగ్ ధీమా కాబోలు.
సో దీనికి సంబంధించిన ప్రకటన ఇవాళ సాయంత్రమో లేక రేపో వచ్చే అవకాశాలు ఉన్నాయి. డేట్ తో పాటుగా కొత్త పోస్టర్ వదులుతారని అంటున్నారు. నిజానికి నాగ్ కు ఇంత ధీమా ఏంటనే ప్రశ్న రావొచ్చు. కొంచెం లోతుగా ఆలోచిస్తే బంగార్రాజుకు ఫ్యామిలీ ఆడియన్స్ లో పాజిటివ్ టాక్ తో పాటు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల ఓవర్ ఫ్లోస్ అడ్వాటేంజ్ అవుతాయనే నమ్మకం జీ టీమ్ లో ఉంది కాబోలు. ఒకవేళ పైన రెండింటిలో ఒకటి యావరేజ్ టాక్ వచ్చినా చాలు అది నాగార్జునకు కలిసి వచ్చే అంశమే. మొదటి వారం పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా రెండో వారం నుంచి ఫుల్ పికప్ ఉంటుందనే భరోసా ఉందని అందుకే ఇలా నిర్ణయించుకున్నారని తెలిసింది
సోగ్గాడే చిన్ని నాయనా టైంలోనూ విపరీతమైన పోటీ ఉండింది. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజాలు బరిలో ఉండగానే నాగ్ విన్నర్ గా నిలిచారు. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. దానికి తోడు బంగార్రాజులో చాలా ఆకర్షణలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్యాస్టింగ్ తో పాటు నాగ చైతన్య, కృతి శెట్టి జోడి వచ్చి చేరింది. దర్శకుడు కల్యాణ కృష్ణ ఈసారి బంగార్రాజు మనవడు చేయబోయే అల్లరిని చూపించబోతున్నాడు. అనూప్ రూబెన్స్ పాటలకు మంచి స్పందనే వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు జీ సంస్థ ఇందులో అధిక పెట్టుబడి పెట్టింది. మరి బంగార్రాజు జనవరి 15 వచ్చే వార్త నిజమవుతుందో లేదో వేచి చూడాలి
Also Read : Bheemla Nayak New Release Date : చివరి నిమిషంలో ఎస్ చెప్పడానికి కారణాలు