iDreamPost
android-app
ios-app

Bangarraju : అక్కినేని టార్గెట్ కష్టమేమి కాదు

  • Published Jan 10, 2022 | 5:26 AM Updated Updated Jan 10, 2022 | 5:26 AM
Bangarraju : అక్కినేని టార్గెట్ కష్టమేమి కాదు

ఇంకో నాలుగు రోజుల్లో అక్కినేని నాగార్జున నాగ చైతన్య కలిసి థియేటర్లకు వచ్చి బంగార్రాజుతో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. తెలుగు ప్రేక్షకులకు ఫస్ట్ పండగ ఛాయస్ గా ఇదే నిలుస్తోంది. కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. నిర్మాణ సంస్థలు జీ అన్నపూర్ణలు ముందు అనుకున్న రేట్ కంటే కాస్త ఎక్కువే చెప్పినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడి మరీ కొనేసుకున్నారని సమాచారం. గత కొన్నేళ్లుగా నాగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు. వైల్డ్ డాగ్ మరీ అన్యాయంగా తక్కువ రేట్ లోనూ బ్రేక్ ఈవెన్ చేయలేకపోయింది.

సో ఇప్పుడు అందరి దృష్టి బంగార్రాజు బిజినెస్ మీద ఉంది. ట్రేడ్ నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకు సుమారు 40 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది మరీ ఎక్కువ మొత్తం కాదు. పాజిటివ్ టాక్ వస్తే చాలు అంతకంతా ఈజీగా వసూలు చేస్తుంది. నైజామ్ 11 కోట్లు, సీడెడ్ 6 కోట్లు, ఉత్తరాంధ్ర 4 కోట్ల 10 లక్షలు, గుంటూరు 3 కోట్ల 24 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 6 కోట్లకు దగ్గరగా, కృష్ణ 2 కోట్ల 70 లక్షలు, నెల్లూరు కోటిన్నర మొత్తం తెలుగు రాష్ట్రాలకు 35 కోట్ల దాకా డీల్ జరిగిందని తెలిసింది. రెస్ట్ అఫ్ ఇండియా రెండున్నర కోట్లు, ఓవర్సీస్ రెండున్నర కోట్లు మొత్తం నలభై కోట్లకు దగ్గరగా ఉందని చెబుతున్నారు. క్రేజ్ బాగానే వచ్చింది.

సో బంగార్రాజు లాభాలు తేవాలంటే కనీసం ఓ 43 కోట్ల దాకా షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. అఖండ, పుష్పకు వచ్చిన స్పందన చూస్తే ఇదేమంత అసాధ్యం కాదు. పైగా సెలవుల సీజన్. ఇంకో వారం దాకా ఫ్యామిలీస్ హాలిడేస్ లోనే ఉంటాయి. ఒమిక్రాన్ తాలూకు భయాలు ఉన్నప్పటికీ జనం థియేటర్లకు వస్తారన్న నమ్మకం నాగార్జున గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు, బస్ స్టాండులు చూస్తుంటే సినిమా హాళ్లకు వచ్చేందుకు జనం భయపడతారన్న అనుమానం అక్కర్లేదు. రౌడీ బాయ్స్, హీరో, నా పేరు శివ 2 పోటీలో ఉన్నప్పటికీ హైప్ విషయంలో అవేవి బంగార్రాజు దగ్గరలో లేవన్నది వాస్తవం

Also Read : Shruti Haasan : ముందు శ్రుతి హాసనే ప్రపోజ్ చేసిందట.. ఓపెన్ అయినట్టేనా?