ఓటమి భయం వెన్నాడుతుంటే.. కుంటిసాకులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది. పార్టీ సీనియర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయగా.. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అంతకంటే ఎక్కువగా మండిపడుతున్నారు. అధినేత నిర్ణయాన్ని ధిక్కరించి పోటీలో కొనసాగేందుకు తెగిస్తున్నారు. గ్రామాల్లో మనుగడ సాగించాలంటే, ఓట్ బ్యాంక్, వర్గాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయక తప్పదని తెగేసి చెబుతున్నారు. ఎక్కడికక్కడ ధిక్కారస్వరం 40 ఏళ్ల పార్టీని, దాని జెండా […]