iDreamPost
android-app
ios-app

రోజాపై ఇలా మాట్లాడినందుకు సిగ్గులేదా.. బండారుపై నవనీత్ కౌర్ ఫైర్

రోజాపై ఇలా మాట్లాడినందుకు సిగ్గులేదా.. బండారుపై నవనీత్ కౌర్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, వైసీపీ నేత, నటి రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలను తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహిళలే కాకుండా యావత్ భారతావనికి చెందిన ఆడపడుచులు ఖండిస్తున్నారు. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే రోజాపై అనవసరంగా నోరు పారేసుకున్న సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ ఫిర్యాదులు అందడంతో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. కాగా, బండారు వ్యాఖ్యలపై సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాకు మద్దతు తెలుపుతూ.. సత్యనారాయణ ఆమెకు క్షమాపణ చెప్పే వరకు పోరాడతానన్నారు.

బండారు వ్యాఖ్యలపై మరో నటి రాధికా శరత్ కుమార్ సైతం మండిపడ్డారు. రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే రహస్యంగా దొంగలా బతకాల్సి వస్తుందని హెచ్చరించారు. అసలు ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు వచ్చినా, తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, మరోనటి, మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘అందరికీ నమస్కారం. ఈ రోజు ఓ వీడియో చూశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. ఓ మహిళా మంత్రి, నటి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద హీరోలతో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి వచ్చాక ఆమెపై ఇలా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు‘ అని అన్నారు.

మీ ఇంట్లో భార్య, ఆడపిల్లలు, అక్కా చెల్లెల్లు లేరా అని ప్రశ్నించారు.  ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు.. ఎంత గొప్పగా మాట్లాడాలో, కాని ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ‘మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించాలి. అవన్నీ వదిలేసి.. ఇలా ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోకూడదు. మీకు పాలిటిక్స్ ఇంపార్టెంటా.. ఆంధ్రా మహిళల గౌరవం ఇంపార్టెంటా? నేను పార్లమెంటులో ఉన్నప్పుడు తెలుగు ప్రజా ప్రతినిధులతో కూర్చున్నప్పుడు.. నాకు ఎంతో రెస్పక్ట్ ఇస్తారు. ఒక ఫీమేల్ నేత, ఆంధ్ర తెలుగు మహిళ గురించి మీరు ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గులేదా? సిగ్గుండాలి. రోజా మహిళలందరం మీకు మద్దతుగా నిలుస్తున్నాం. రాజకీయ నేత, మహిళ, పోరాట యోధురాలిగా మహిళంతా మీకు అండగా ఉన్నాం’ అంటూ వీడియోలో పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి