సంచలనం సృష్టించిన ఇఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ? ఏసిబి కస్టడీలో ఉన్న అచ్చెన్నతో పాటు అప్పటి ఉన్నతాధికారులను ఏసిబి విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏసిబి విచారణలో అచ్చెన్న పెద్దగా సహకరించకపోయినా ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు మాత్రం కుంభకోణానికి సంబంధించిన పూర్తి విషయాలను బయటపెట్టేశారని తెలుస్తోంది. అంటే అరెస్టయిన ఉన్నతాధికారుల సాక్ష్యాలను బట్టి రూ. 157 కోట్ల భారీ కుంభకోణంలో అచ్చెన్నే కీలక సూత్రదారిగా అర్ధమవుతోంది. ఇఎస్ఐ […]
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు ఏసీబీ కస్టడీ ముగిసింది. ఏసీబీ పిటిషన్ మేరకు అచ్చెం నాయుడును మూడు రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. గురువారం మొదలైన ఏసీబీ కస్టడీ నేటితో ముగిసింది. మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు అచ్చెం నాయుడును గుంటూరు జీజీహెచ్‌లోనే విచారించారు. అచ్చెం నాయుడు న్యాయవాదులు, ఆయనకు చికిత్స చేసిన వైద్యుల సమక్షంలోనే […]
మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. కింజారపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతోందంటూ లోకేష్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఈఎస్‌ఐలో అవినీతి జరిగితే […]
ఈఎస్ఐ స్కాం ఏసీబీ అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన స్వగ్రామంలో ఏసీబీ అరెస్ట్ చేసినా.. మొలలకు ఆపరేషన్ జరగడంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించినా.. ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అచ్చెం నాయుడు కోలుకున్నారు. ఏసీబీ విజ్ఞప్తి మేరకు ఆయన్ను మూడు రోజులు కస్టడీకి ఇస్తూ ఏబీసీ కోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో నిన్న అర్థరాత్రి గుంటూరు జీజీహెచ్‌లో హైడ్రామా నడిచింది. […]
మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభ్యర్ధనను న్యాయస్ధానం కొట్టేసింది. మెరుగైన వైద్యం కోసం తనను సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో చేర్చేందుకు అనుమతించాలంటూ అచ్చెన్న కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆయన పిటీషన్ను పరిశీలించిన కోర్టు అచ్చెన్నను సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కు తరలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం మాజీమంత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇఎస్ఐ కుంభకోణంలో కీలక పాత్రదారుడన్న అభియోగాలతో ఏసిబి అధికారులు అచ్చెన్నను 15 రోజుల క్రితం అరెస్టు చేసిన […]
ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన ఈఎస్ఐ స్కాం ప్రకంపనలు తెలంగాణలోనూ మొదలయ్యాయి. ఇక్కడ కూడా దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే సీపీఎం డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో గతంలో కూడా ఎన్నో సార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు పేర్కొంది. మందుల కొనుగోళ్లు, టెండర్లలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపిస్తోంది. దీంతో ఆ స్కాం కి సంబంధించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం బయటపడడంతో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌ను విజిలెన్స్ […]
రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ESI స్కాంలో ఇప్పటికే సూత్రధారిగా తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మిక మంత్రి గా బాధ్యతలు నిర్వహించిన అచ్చం నాయుడితో పాటు సంబంధిత అధికారులని అరెస్టు చేశారు. వీరితో పాటు ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న మరో 12 మందిని రాబోయే రోజుల్లో అరెస్టు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) తెలిపింది. ఇదిలా ఉంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓటింగ్ లో పాల్గొన్న గుడివాడ శాసన సభ్యులు వల్లభనేని […]
’తాను మంత్రిగా ఉన్నపుడు ఇఎస్ఐలో ఎలాంటి అవినీతి జరగలేదు’ ఇది తాజాగా మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు. మీడియాతో పితాని మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. ఇఎస్ఐలో కుంభకోణం జరిగిందా ? లేదా ? అనే విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. ఎందుకంటే ఐదేళ్ళల్లో జరిగిన సుమారు రూ. 900 కోట్ల కొనుగోళ్ళల్లో రూ. 157 కోట్లు అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ తేల్చింది. దాన్ని […]
అమాయకులను అన్యాయంగా అరెస్టు చేస్తే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. న్యాయం కోసం అలా ఫిర్యాదు చేయడం కూడా సబబే. కాని రాష్ట్రంలో టిడిపి అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. అవినీతి, అక్రమాలు చేసిన వారిని అరెస్టు చేస్తే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అంటే టిడిపిలో పరిభాషలో అవినీతి, అక్రమాలు చేయడం తప్పుకాదు కదా..! అలాగే అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయకూడదా..! అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలనే రాజకీయ పార్టీలను […]