iDreamPost
android-app
ios-app

వారణాసి విలన్ కథ ఏంటంటే !

  • Published Nov 17, 2025 | 10:27 AM Updated Updated Nov 17, 2025 | 10:27 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇప్పటివరకు ఉన్న SSMB 29 కాస్త వారణాసి గా ఫైనల్ అయిపోయింది. గత కొన్ని రోజులుగా ఈ టైటిల్ ప్రచారంలో ఉన్నదే. కాబట్టి కష్టపడి డీకోడ్ చేసిన వాళ్లంతా హ్యాపీ. మహేష్ లుక్ .. చూపించిన గ్లిమ్ప్స్ అందులో విఎఫ్ఎక్స్ వర్క్ కు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. మొన్నటినుంచి సోషల్ మీడియా అంతా రాజమౌళి ఆరా నే కనిపిస్తుంది వినిపిస్తుంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇప్పటివరకు ఉన్న SSMB 29 కాస్త వారణాసి గా ఫైనల్ అయిపోయింది. గత కొన్ని రోజులుగా ఈ టైటిల్ ప్రచారంలో ఉన్నదే. కాబట్టి కష్టపడి డీకోడ్ చేసిన వాళ్లంతా హ్యాపీ. మహేష్ లుక్ .. చూపించిన గ్లిమ్ప్స్ అందులో విఎఫ్ఎక్స్ వర్క్ కు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. మొన్నటినుంచి సోషల్ మీడియా అంతా రాజమౌళి ఆరా నే కనిపిస్తుంది వినిపిస్తుంది.

  • Published Nov 17, 2025 | 10:27 AMUpdated Nov 17, 2025 | 10:27 AM
వారణాసి  విలన్ కథ ఏంటంటే !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇప్పటివరకు ఉన్న SSMB 29 కాస్త వారణాసి గా ఫైనల్ అయిపోయింది. గత కొన్ని రోజులుగా ఈ టైటిల్ ప్రచారంలో ఉన్నదే. కాబట్టి కష్టపడి డీకోడ్ చేసిన వాళ్లంతా హ్యాపీ. మహేష్ లుక్ .. చూపించిన గ్లిమ్ప్స్ అందులో విఎఫ్ఎక్స్ వర్క్ కు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. మొన్నటినుంచి సోషల్ మీడియా అంతా రాజమౌళి ఆరా నే కనిపిస్తుంది వినిపిస్తుంది. ఆ గ్లిమ్ప్స్ ను కూడా మెల్ల మెల్లగా డీకోడ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ దీనికి ముందు రిలీజ్ చేసిన విలన్ లుక్ , ప్రియాంక చోప్రా లుక్ కు మాత్రం కాస్త మిశ్రమ స్పందన వచ్చింది.

ముఖ్యంగా కుంభ క్యారెక్టర్ సాధారణంగా ఉందని.. అది వేరే పోస్టర్స్ కు కాపీలా ఉందని.. రాజమౌళి రేంజ్ విలన్ కాదనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ గ్లిమ్ప్స్ తర్వాత కుంభ క్యారెక్టర్ ను డీకోడ్ చేస్తే.. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంటుందని అంటున్నారు. అసలు కుంభ అనే పేరు పెట్టడానికి వెనుక ఓ రీజన్ కూడా ఉందట. రామాయ‌ణంలోని పాత్ర‌ల్లో ఒక‌టైన కుంభ‌క‌ర్ణుడి పాత్ర స్ఫూర్తితోనే ఈ క్యారెక్టర్ ను డ్జిజైన్ చేసుకున్నాడట జక్కన్న. ఆరు నెల‌లు నిద్ర‌పోయి.. ఆరు నెల‌లు మేల్కొని ఉండే కుంభ‌క‌ర్ణుడు.. . రావ‌ణాసురుడితో యుద్ధానికి ముందు రాముడికి సవాలుగా నిలుస్తాడు.

దీనితో రాముడు అతని చేతులను కాళ్ళను నరికేస్తాడు. ఇక ఇప్పుడు పృథ్వి రాజ్ లుక్ ను గమనిస్తే ఇదే అర్ధమౌతుంది. కాళ్ళు చేతులు పనిచేయకుండా చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి ఆ పాత్రకు కుంభ అనే పేరు పెట్టారు. పైగా ఈ క‌థ‌కు రామాయ‌ణంతో లింక్ ఉంద‌ని.. మ‌హేష్ బాబు ఇందులో రాముడిగా క‌నిపిస్తాడని రాజ‌మౌళి చెప్పకనే చెప్పారు. సో కుంభకర్ణుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కుంభ పాత్రను సృష్టించాడు రాజమౌళి . రాజమౌళి దీనిని తెరమీద ఏ విధంగా చూపించబోతున్నాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.