iDreamPost
android-app
ios-app

ఘట్టమనేని వారసుడికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు

  • Published Nov 17, 2025 | 2:33 PM Updated Updated Nov 17, 2025 | 2:33 PM

ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వారసుల పరంపర ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పటికే ఇలా ఎంతో మంది వారసుల తమ తమ తండ్రులు తాతల పేర్లు నిలబెడుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఘట్టమనేని వంశం నుంచి మూడో తరం ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు . మహేష్ పిల్లలు ఇద్దరు కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఎప్పుడో చెప్పేసారు.

  • Published Nov 17, 2025 | 2:33 PMUpdated Nov 17, 2025 | 2:33 PM
ఘట్టమనేని వారసుడికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు

ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వారసుల పరంపర ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పటికే ఇలా ఎంతో మంది వారసుల తమ తమ తండ్రులు తాతల పేర్లు నిలబెడుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఘట్టమనేని వంశం నుంచి మూడో తరం ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు . మహేష్ పిల్లలు ఇద్దరు కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఎప్పుడో చెప్పేసారు. అయితే వీరికంటే ముందు దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినిమాల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే.

దీనికి సంబందించిన అఫీషియల్ పోస్టర్ కూడా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా ఈ సినిమా రాబోతుందట. మరి ఈ సినిమాలో జయకృష్ణకు జోడిగా నటించబోయేది ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది . అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ నటించబోతుందట. దానికి సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేశారు టీం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాషా తడానీ కుటుంబం ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. ఆమె తల్లి ఓ స్టార్ హీరోయిన్ , తండ్రి అనిల్ తడానీ ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్. ఇలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న రాషా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందట. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.