Swetha
ఓ సినిమాను ఏ విధంగా జనాల్లోకి తీసుకుని వెళ్తే రీచ్ ఉంటుందో రాజమౌళి కి తప్ప ఎవరికీ తెలీదు. కేవలం సినిమా అనౌన్సుమెంట్ కే రెండు రోజుల ముందు నుంచే వర్క్ షాప్స్ నిర్వహించి అందరిలో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశారు. అయితే ముందుగా రాజమౌళి చెప్పినట్టు సినిమా కథ గురించి పెద్దగా రివీల్ చేయలేదు.
ఓ సినిమాను ఏ విధంగా జనాల్లోకి తీసుకుని వెళ్తే రీచ్ ఉంటుందో రాజమౌళి కి తప్ప ఎవరికీ తెలీదు. కేవలం సినిమా అనౌన్సుమెంట్ కే రెండు రోజుల ముందు నుంచే వర్క్ షాప్స్ నిర్వహించి అందరిలో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశారు. అయితే ముందుగా రాజమౌళి చెప్పినట్టు సినిమా కథ గురించి పెద్దగా రివీల్ చేయలేదు.
Swetha
ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా రోజు రానే వచ్చింది. ఓ సినిమాను ఏ విధంగా జనాల్లోకి తీసుకుని వెళ్తే రీచ్ ఉంటుందో రాజమౌళి కి తప్ప ఎవరికీ తెలీదు. కేవలం సినిమా అనౌన్సుమెంట్ కే రెండు రోజుల ముందు నుంచే వర్క్ షాప్స్ నిర్వహించి అందరిలో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశారు. అయితే ముందుగా రాజమౌళి చెప్పినట్టు సినిమా కథ గురించి పెద్దగా రివీల్ చేయలేదు. కానీ వదిలిన గ్లిమ్ప్స్ నుంచి డీకోడ్ చేస్తే కొన్ని విషయాలు అర్ధమయ్యే అవకాశం ఉంది. ఈ వారణాసి కథ ఇప్పటిది కాదు. ఎప్పుడో ఐదవ శతాబ్దంలో మొదలవుతుంది.
ఆ ఐదవ శతాబ్దంలో వారణాసిలో మొదలైన కథ.. ఇప్పుడు వర్తమానంలో ఇక్కడి నుంచి ఆఫ్రికా అడవులు, వనాంచల్ ద్వారా త్రేతాయుగంలో లంకా నగరానికి వెళ్లేలా ఒకటి రెండు కాదు ఏడెనిమిది ప్రపంచాలను చూపించారు. ఆ తర్వాత కారణం జన్ముడిగా మహేష్ ను రుద్ర గా పరిచయం చేశారు. ప్రస్తుతానికి రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ నుంచి అందరు డీకోడ్ చేయగలిగినది ఇది మాత్రమే. ఆ గ్లిమ్ప్స్ లో ఎక్కువశాతం సిజి విజువల్స్ ఏ కనిపించాయి. రాజమౌళి మార్క్ ఉంటె ఇక సిజి విషయంలో ఎలాంటి తప్పులు వెతకాల్సిన అవసరం ఉండదు. ఇక మహేష్ విషయానికొస్తే… ఎవరి ఊహలకు అంతుచిక్కని విధంగా మహేష్ ను చూపించాడు జక్కన్న.
ఇది కచ్చితంగా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మూవీగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహమే లేదు. ఆల్వేస్ థింక్ బిగ్ అనే వాఖ్యాన్ని రాజమౌళి ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉంటాడు. బాహుబలి కేవలం మాహిష్మతి రాజ్యంలోనే జరిగే కథ… ఆర్ఆర్ఆర్ బ్రిటిష్ సామ్రాజ్యం దాటి వెళ్ళలేదు. కానీ వారణాసి అలా కాదు.. యుగాల క్రితం జరిగిన కథ , కొన్ని లోకలా చుట్టూ తిరిగే కథ.. అసలు రాజమౌళి ఏమి చెప్పాలని అనుకుంటున్నాడో తెలియాలంటే ఇంకో రెండేళ్లు ఆగాల్సిందే. ఆలస్యం అయినా పర్లేదు ఆ సినిమాకు న్యాయం చేస్తాడనే నమ్మకం అందరిలో ఉంది కాబట్టి.. ఖచ్చితంగా అందరి ఎదురుచూపులు న్యాయం జరుగుతుంది. ప్రస్తుతానికి బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ హై లో ఉన్నారు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.