స్వయం ప్రకటిత మేధావిగా పేరుగాంచిన ఆర్థిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తన తెలివితేటలను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు యనమల రామకృష్ణుడు తన మేధావితనాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని చెప్పేందుకు యనమల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ హాయంలో చేసిన అప్పుల మాటేమిటన్న ప్రశ్న వస్తుందని ముందే ఊహించిన యనమల రామకృష్ణుడు తాము చేసిన అప్పులను గత ప్రభుత్వాలతో కలిపి చెబుతూ […]
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పత్రికల స్టాండ్ పార్టీల వారీగా మారుతుంటుందని ప్రత్యేకంగా చెపాల్సినపని లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో నిత్యం ప్రభుత్వానికి అనుకూలమైన కథనాలు వస్తుండేవి. ఆ సమయంలో సాక్షి ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది. ఏడాది క్రితం నుంచి వైసీపీ పాలన మొదలైంది. పత్రికలు తమ పనితీరును మార్చేశాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తుండగా.. సాక్షి ప్రభుత్వ అనుకూల కథనాలకు ప్రయారిటీ ఇస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక కథనాలు […]
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ అనంతరం అంటే గత మార్చి 24 తర్వాత దేశంలోనే తొలిసారిగా సమావేశమవుతున్న చట్టసభ ఏపీ శాసన సభ కావడం విశేషం. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ బడ్జెట్ ఆమోదం అనివార్యంగా మారిన సమయంలో వీలయినంత స్వల్ప సమయంలో సమావేశాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అవకాశం ఉన్న సమయంలో విపక్షం కోరినట్టుగా అదనపు సమయంలో కూడా సభ నిర్వహణకు అంగీకరించిన ప్రభుత్వం ఈసారి […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. అనంతరం వెంటనే బడ్జెటన్ ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్లు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 2.25 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ను వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టబోతోంది. జగన్ సర్కార్ ఏర్పాడ్డకా ఇది రెండో బడ్జెట్. […]