అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై వివిధ దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏప్రిల్ వరకూ అమలులో కొనసాగనున్నాయి. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేలను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రిం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల 7వ తేదీకి వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ ఉన్నందున ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై మరో రోజు వాదనలు వింటామని జస్టిస్ అశోక్ […]
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణకు ముహూర్తం సమీపిస్తున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంలో కీలక నిర్ణయాలుంటాయనే ప్రచారం ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో అమరావతికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే దిశలో సాగుతోంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఏంచేయాలనే దానిపై చర్చ మొదలయ్యింది సీఎస్ నేతృత్వంలోని ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపింది. ప్రతిపాదనలు […]
అమరావతి రాష్ట్ర భవిష్యత్. ఐదు కోట్ల ప్రజలది. నేను ఉంటే ఇంకో పది పదిహేనేళ్లు ఉంటా. మీ భవిష్యత్ కోసం అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేయండి. యువత కదిలి రండి.. ఇలా ఏడాదికి పైగా అమరావతి తప్పా మరే అంశంపై కూడా దృష్టి పెట్టని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. తాజాగా పంచాయతీ ఎన్నికల కోసమంటూ విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామనే విషయాన్ని పొందుపరచకపోవడం ఆశ్చర్యంగా […]
యక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చి తమ్ముళ్లని బతికించుకొన్న ధర్మజునికి కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టమేమో . కానీ చంద్రబాబు నైజమెరిగిన ఆంధ్రా ప్రజలు మాత్రం ఒక్కటి చెప్పగలరు . ఆయన ఉద్దేశ్యాలు , ప్రయోజనాలు నెరవేరెవరకూ రైతుల్ని అగమ్యగోచరంగా ఉద్యమం పేరిట ముందుకు నెడుతూనే ఉంటాడు . రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పేరిట భూసమీకరణకు తెర తీసిన బాబు దీనికి ముందు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , సూచనలు పక్కన […]
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఒక్కో పార్టీకి ఒక్కో బలమైన అవకాశం ఉందనే చెప్పాలి. సంక్షేమ పథకాలు అధికార వైఎస్సార్సీపీకి ఉన్న అవకాశంగా చెప్పొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి అవకాశం కాగా, తెలుగుదేశం పార్టీకి మాత్రం అమరావతే ఒక్కగానొక్క అవకాశంగా కన్పిస్తోంది. ఈ అవకాశాన్నే రాచబాటగా చేసుకుని ప్రజల ముందుకు వెళ్ళేందుకు అనేక వ్యూహలను పన్నుతుంటాయి ఆయా పార్టీలు. ఆయా పార్టీలు తమకు లభిస్తున్న అవకాశాలను బట్టి ఆయా అంశాలకు మరిన్ని కొత్తవాటిని జోడించుకుంటూ ముందుకెళ్ళే ఆలోచనలు […]
ఏపీ రాష్ట్ర రాజధాని విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీ రాష్ట్ర నాయకత్వానికి ఒకలా, తన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్కళ్యాణ్కు ఒకలా చెప్పిందా? అన్న ప్రశ్న ఇప్పుడు విశ్లేషకుల మెదళ్ళను తొలుస్తోంది. ఇటీవలే రాజధాని ప్రాంత వాసులతో సమావేశన పవన్ కళ్యాణ్ రాజధానిని అమరావతిలోనే ఉంటుందని బీజేపీ తనకు చెప్పిందని వ్యాఖ్యానించడం పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చజోరందుకుంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోదని రాష్ట్ర బీజేపీ నాయకత్వం తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగానే […]
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉద్యమం ఇకపై పరోక్షంగా సాగనుందా..? ప్రత్యక్ష పోరాటాలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వస్తి పలికారా..? ప్రత్యక్ష పోరాటం కేవలం అమరావతిలోని 29 గ్రామాలకే పరిమితం చేయదలుచుకున్నారా..? ఇతర ప్రాంతాలలోనూ పార్టీని బతికించుకోవాలనుకుంటున్నారా..? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాల ద్వారా అవుననే సమాధానం వస్తోంది. రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ నిన్న చేయదలుచుకున్న గుంటూరు జైల్ భరోను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును […]
ఏపీ బీజేపీ నేతలు తలో వైఖరి తీసుకోవడం ఈనాటిది కాదు. కానీ ప్రస్తుతం కీలకాంశాలలో తలో మాట మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ తో రాజకీయ రంగప్రవేశం చేసి కేంద్రమంత్రి వరకూ ఎదిగిన పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించగానే చేసిన వ్యాఖ్యలు అందుకు కొనసాగింపుగా ఉన్నాయి. ఆమెతో పాటుగా మరో కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. ఇప్పటికే రామ్ మాధవ్, జీవీఎల్ వంటి సీనియర్లు, ప్రస్తుతం […]
రాజధాని కోసం మా భూములు త్యాగం చేశాం. మా భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకూ మా పోరాటం ఆగదు.. అంటున్న అమరావతిలోని నాలుగైదు గ్రామాల రైతులకు అసలు అమరావతి వ్యవహారంపై జరిగిన, జరుగుతున్న అంశాలపై అవగాహన ఉందా..? లేదా..? అనే సందేహాలు వారు చేస్తున్న ప్రకటనల వల్ల అందరిలోనూ కలుగుతున్నాయి. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతూ వైసీపీ పెద్దలు అమరావతిపై పెద్ద కుట్ర చేస్తున్నారని ఉద్యమం చేస్తున్న […]
పారిశ్రామికవేత్తగా ఉంటూ తెలుగుదేశం నుంచి రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసి.. ఆ పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ అయిన సుజనా చౌదరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమితో బీజేపీ పంచన చేరారు. ఆయన బీజేపీలో చేరి ఏడాది అవుతోంది. అయినా ఇప్పటికీ బీజేపీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు, పనితీరు సుజనా చౌదరి వంటబట్టించుకోలేదా..? అనే సందేహం ఆయన ప్రవర్తిస్తున్న తీరును బట్టి రాజకీయాలను క్షణ్నంగా ఫాలో అయ్యే వారిలో కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర […]