iDreamPost
android-app
ios-app

ఈ దీపావళి విన్నర్ ఎవరంటే

  • Published Oct 21, 2025 | 10:09 AM Updated Updated Oct 21, 2025 | 10:09 AM

పండగ సీజన్స్ వచ్చాయంటే మూవీ లవర్స్ కు కూడా పండగే. ఎందుకంటే టాలీవుడ్ ఇలాంటి సీజన్స్ మీద బాగా ఫోకస్ చేస్తుంది. ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తుంది. సెలవలు రావడంతో అంతా థియేటర్స్ ముందు క్యూ కడతారు. అలా దసరా , సంక్రాంతి సీజన్స్ లో టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ గత రెండు సంవత్సరాల నుంచి దీపావళి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది.

పండగ సీజన్స్ వచ్చాయంటే మూవీ లవర్స్ కు కూడా పండగే. ఎందుకంటే టాలీవుడ్ ఇలాంటి సీజన్స్ మీద బాగా ఫోకస్ చేస్తుంది. ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తుంది. సెలవలు రావడంతో అంతా థియేటర్స్ ముందు క్యూ కడతారు. అలా దసరా , సంక్రాంతి సీజన్స్ లో టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ గత రెండు సంవత్సరాల నుంచి దీపావళి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది.

  • Published Oct 21, 2025 | 10:09 AMUpdated Oct 21, 2025 | 10:09 AM
ఈ దీపావళి విన్నర్ ఎవరంటే

పండగ సీజన్స్ వచ్చాయంటే మూవీ లవర్స్ కు కూడా పండగే. ఎందుకంటే టాలీవుడ్ ఇలాంటి సీజన్స్ మీద బాగా ఫోకస్ చేస్తుంది. ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తుంది. సెలవలు రావడంతో అంతా థియేటర్స్ ముందు క్యూ కడతారు. అలా దసరా , సంక్రాంతి సీజన్స్ లో టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ గత రెండు సంవత్సరాల నుంచి దీపావళి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. గత ఏడాది దీపావళికి వచ్చిన నాలుగు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాలలో ఏ సినిమా దీపావళి విన్నర్ గా నిలిచింది అనే విషయానికొస్తే..

అందరికంటే ముందు పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో వచ్చిన మూవీ మిత్రమండలి. జాతిరత్నాలు , మ్యాడ్ తరహాలో ఈ సినిమా అందరిని మెప్పిస్తుందని అంతా అనుకున్నారు. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే బ్యాడ్ టాక్ రావడంతో మొదటి రోజే ఓపెనింగ్స్ డౌన్ అయిపోయాయి. ఇక ఆ తర్వాత శుక్రవారం రోజున డ్యూడ్, తెలుసు కదా సినిమాలు రిలీజ్ అయ్యాయి. సూపర్ హిట్ టాక్ కాకపోయినా సరే పరవాలేదు అనిపించుకునే టాక్ ను దక్కించుకున్నాయి. రివ్యూస్ కూడా అలానే వచ్చాయి.

ఇక రేస్ లో లాస్ట్ గా వచ్చిన సినిమా కే ర్యాంప్. వచ్చిన నాలుగు సినిమాలలో ఈ సినిమా కాస్త బెటర్ అనిపించుకుంది. మాస్ ఆడియన్స్ ను బాగా మెప్పించింది. ముఖ్యంగా బి, సి సెంటర్స్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం క్లియర్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఇది టాక్ పరంగా మాత్రమే. లెక్కల పరంగా ఎవరు విన్నర్ అనేది ఓ వారం తర్వాత క్లియర్ గ తెలుస్తుంది. సో మొత్తానికి కిరణ్ అబ్బవరంకు దీపావళి సీజన్ బాగానే కలిసొస్తుందని చెప్పొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.