నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారావారిపల్లెలో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తలపెట్టిన బహిరంగ సభ విజయవంతమైన తీరు చూస్తే బాబు గారి స్వగ్రామంలో , చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రాజధాని వికేంద్రీకరణ పట్ల అత్యంత సానుకూలత ఏర్పడింది అని చెప్పొచ్చు . సాధారణంగా అధికార పార్టీ నిర్వహించే బహిరంగ సభలకు ఆయా ప్రభుత్వాలు జనాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తాయి . కానీ నారావారిపల్లెలో కనీస […]
రాజధాని మార్పుకు సంబంధించి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ తరుణంలో ఈనెల 20న అసెంబ్లీ, 21, 22 న ఉభయ సభలను సమావేశపర్చాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి సంభందిచిన సమాచారాన్ని అటు అసెంబ్లీ ఇటు శాసనమండలి సభ్యులకు అధికారికంగా తెలియచేసింది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం రాజధాని మార్పునకు సంబంధించి బిల్లును అసెంబ్లిలో ప్రవేశ పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా గతంలో అసెంబ్లీ ఆమోదించిన సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయడం, ఆ స్థానంలో పాత […]
అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకణపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కార్ ఈ విషయంపై విధాన పరమైన నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి సందేహాలు, చర్చలకు అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో సాగుతున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెల 17వ తేదీన అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున మూడు రాజధానుల ఏర్పాటుపై తన ఆలోచనను సీఎం జగన్ వెల్లడించినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అమరావతి కేంద్రంగా నిరసనలు కొనసాగిస్తోంది. జీఎన్ […]
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ సోమవారం జరగనుంది. ఈ రోజు క్యాబినెట్ సమావేశం ఉంటుందని ముందుగానే నిర్ణయించినా మళ్లీ సోమవారానికి వాయిదా పడింది. క్యాబినెట్ భేటీ అనంతరమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9 గంటలకు సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 13 జిల్లాల సమగ్రాభివృద్ధిపైన, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపైన హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక మీద చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. రాజధానితోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల […]
సచివాలయ సిబ్బంది చేసిన పొరపాటో లేక ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో కానీ ప్రభుత్వం ఇచ్చే అధికారిక ఉత్తర్వుల్లోనే పలు తప్పులు దొర్లుతున్నాయి. ముందుగా శనివారం క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామన్నారు.. తర్వాత సోమవారం క్యాబినెట్ సమావేశం అంటూ ఇచ్చిన ఆదేశాల్లో తప్పులు దొర్లాయి. 2020 డిసెంబర్ 20వ తేదీన క్యాబినెట్ సమావేశం అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే 2020 జనవరి నెలకు బదులు ఏకంగా నెలనే మార్చేస్తూ డిసెంబర్ అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే శనివారమే సమావేశం వార్తలు వచ్చాయి.. […]
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను సూచిస్తూ జీఎన్ రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలపై సమగ్రంగా అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ ఈ రోజు సీఎం వైఎస్ జగన్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. రెండు నివేదికలపై మూడు సార్లు సమావేశమైన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని కమిటీ ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజెంటేషన్ ద్వారా తమ సూచనలను వివరించింది. మంత్రులు, ఉన్నతాధికారులతో జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి […]
రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎపి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. తొలుత 20 వ తారీఖు ఉదయం క్యాబినెట్ సమావేశం జరుగుతుందని ఆ తరువాత 11 గంటల నుండి అసెంబ్లీ సమావేశం జరుగుతుందని ప్రకటించినప్పటికీ, అనుకున్న దానికంటే రెండు రోజుల ముందే క్యాబినెట్ సమావేశం జరగనుండడం విశేషం. అయితే రాష్ట్రానికి సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకునే ముందు క్యాబినెట్ లో ఆమోదించి, ఆ వెనువెంటనే అదే రోజు అసెంబ్లీ సమావేశంలో కీలకమైన బిల్లులు పెట్టడం అంత శ్రేయస్కరం కాదని […]
అమరావతి – శక్తిపీఠమా? పురాణ కథ ప్రకారం సతీదేవి తండ్రి దక్షుడి మీద కోపంతో అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దానికి కోపగించిన పరమేశ్వరుడు దక్షుణ్ణి సంహరించి సతీదేవి శరీరం తీసుకెళుతుండగా ఆమె శరీర భాగాలు పద్దెనిమిది చోట్ల పడి శక్తిపీఠాలుగా వెలిశాయి. వాటినే అష్టాదశ (అష్ట అంటే ఎనిమిది, దశ అంటే పది) శక్తిపీఠాలు అంటారు. లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ, […]
Think Big అనేది పర్సనాలిటీ డెవలప్ మెంట్, లైఫ్ స్టైల్ డెవలప్ మెంట్ ట్రెయినర్లు తమ క్లైంట్లకు చెప్పే మంత్రం. అయితే ఇందులో కొంత రిస్క్ కూడా ఉంది. వ్యక్తిగత స్థాయిలో థింక్ బిగ్ సూత్రాన్ని అనుసరించి దెబ్బ తింటే నష్టం దెబ్బ తిన్న వ్యక్తులకే పరిమితం అవుతుంది. ఏదైనా కంపెనీ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అయితే ఆ కంపెనీ షేర్ హోల్డర్లు దెబ్బ తింటారు. అదే ఏదైనా రాష్ట్ర, దేశ అధినేతలు అయితే ఆ రాష్ట్ర లేదా […]
రాజధాని నిర్మాణంలో మొదటి భాగం పాలకులు – నగర నిర్మాణం#1 కు , రెండవ భాగం పాలకులు – నగర నిర్మాణం#2 లకు కొనసాగింపు … పాలకులకు ఉండే భిన్నాభిప్రాయాలతో విజయవాడ ఆదినుండి నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎందుకో తెలియదు, ఏ పాలకుడూ విజయవాడను కేంద్రంగా చేసుకోలేదు. అటు అమరావతి, ఇటు కొండపల్లి రాజధానులుగా ఉన్నాయి కానీ, విజయవాడ అప్పుడూ, ఇప్పుడూ పాలనా కేంద్రంగా చూడబడలేదు (నేను చరిత్రకారుణ్ణి కాదు. పెద్దగా చరిత్ర లోతుల్లోకి వెళ్ళి చూడలేదు. ఈ అంశంలో తేడా […]