నేడు జరగబోయే హై పవర్ కమిటీ సమావేశమే చివరి సమావేశం కాదని భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. అయన మీడియాతో మాట్లాడుతూ నిజమైన రైతుల పట్ల అందరికీ సానుభూతి ఉందని రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలనే కాకుండా రైతులకు మరింత మేలు కలిగే చర్యలు తీసుకుంటామని అయన పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటే సానుకూలంగా స్పందిస్తామని తెలిపారు.
జిల్లాల వారీగా అభివృద్ధి జరగాలనేది మా పార్టీ ఉద్దేశ్యమని బొత్స వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలన్నదే తమ పార్టీ విధానమని, 13 జిల్లాల్లో ఉన్న వనరులు, సమస్యలు గురించి తెలుసుకుని జిల్లాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అధికారులను తరలింపుపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు జరగబోయే హై పవర్ కమిటీనే చివరి సమావేశం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకునే క్రమంలో మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు.