iDreamPost
iDreamPost
అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి ఊహించినంత మద్దతు దక్కటం లేదు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టడం వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటూ వైసీపీ నేతలు చెబుతుంటే దీన్ని వ్యతిరేకించడం చంద్రబాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీన అమరావతి పరిరక్షణ సమితి ఆద్వర్యంలో చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బాబు బస్సు యాత్ర చేసేందుకు పరిరక్షణ నేతలు సిద్ధమయ్యారు.
అయితే దీనిపై కదిరి ఎమ్మెల్యే పి.వి సిద్దారెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతాన్నిఅభివృద్ధి చేయకుండా తనకు కావాల్సిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నారని బాబుపై ద్వజమెత్తారు. రాయలసీమ వాసిగా చంద్రబాబు పర్యటనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
ఇటు నేతలతో పాటు రాయలసీమకు చెందిన విద్యార్థి సంఘాలు కూడా చంద్రబాబు వైఖరిని తప్పుబడుతున్నాయి. 13వ తేదీన చంద్రబాబు పెనుగొండలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అనంతపురంలో ర్యాలీ నిర్వహిస్తారు. ఈ మేరకు వారు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అడుగడుగునా సీమ అభివృద్ధి కోరుకునే నేతలు, ప్రజలు పర్యటనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బాబు పర్యటన ఎలా జరుగుతుందో వేచి చూడాలి