ఇటివలి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. దాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు రోజుల పాటు మీడియా సమావేశం పెట్టి వివరించారు. అందులో ప్రభుత్వ సంస్థల అమ్మకాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ప్రభుత్వ సంస్థల అమ్మకంపై చర్చ ఇది తొలిసారి కాదు.. మోడీ సర్కార్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ, అమ్మకంపై చర్చ జరిగింది. ఇప్పటికే నీతి ఆయోగ్ సూచన మేరకు మోడీ సర్కార్ కొన్ని సంస్థల […]
ఫెడరలిజం స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం షరతులతో మంటగలుపుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుతూ దరిద్రమైన ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రాలను బిక్షగాళ్ల మాదిరిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఉత్త డొల్లని, బోగస్ అని కేసీఆర్ అభివర్ణించారు. ఇందులో ప్రభుత్వం పెట్టేది లక్ష కోట్ల రూపాయలు కూడా లేదని జపాన్ నుంచి […]
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఐదో విడత ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఐదో దఫాలో ఏడు అంశాలకు సంబంధించిన ప్యాకేజీని విడుదల చేశారు. నరేగా, ఆరోగ్యం, విద్య, వ్యాపారాలు, సరళతర వ్యాపార విధానం, మోసాల నివారణ, రాష్ట్రాలకు ఆర్థిక వనరులకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను ప్రకటించారు. – […]
కరోనా వైరస్ వల్ల స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్తను తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీలో రెండో భాగాన్ని కొద్దిసేపటి క్రితం దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నిన్న మొదటి విడతలో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన ప్యాకేజీని ప్రకటించిన ఆర్థిక మంత్రి ఈ రోజు రైతులు, పేదలు, వలసకూలీలు, అసంఘటిత రంగాల కార్మికులకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. గత రెండు నెలల్లో 25 […]
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ప్రారంభించారు. లాక్ డౌన్ సమయంలో పేదలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిన్నమొన్నటి వరకు డిమాండ్ చేసిన చంద్రబాబు తాజాగా ఆ మొత్తాన్ని పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఇవ్వాలని తాజాగా డిమాండ్ చేశారు. నిన్న టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన 20 […]
దేశం ఇప్పుడు కరోనా కష్టాల కన్నా వలస జీవుల వెతలు చూసి ఎక్కువగా కలత చెందుతోంది. నిత్యం జాతీయ రహదారులు, రైల్వే లైన్ల వెంబడి నడుస్తూ సాగుతున్న వారి కష్టాలతో కన్నీరు పెడుతోంది. చంటిబిడ్డలను చంకనెత్తుకుని , వేల కిలోమీటర్ల మేర పయనంలో అడుగులేస్తున్న అభాగ్యులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. వలస కూలీల కష్టాలతో కల్లోలపడిన మనసులు […]
కరోనా కష్ట కాలంలో దేశ ఆర్థిక అభివృద్ధి కోసం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ లో పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి కేటాయింపులు ఉండబోవని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంకేతాలిచ్చారు. నిన్న మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ కి సంబంధించిన కొన్ని వివరాలను ఈరోజు వెల్లడించారు. 20 లక్షల కోట్లను 15 రకాలుగా కేటాయింపులు చేశామని వెల్లడించిన […]
కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ తో మందగించిన దేశ ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు నిన్న మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని సంబంధించిన వివరాలను కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. 20 లక్షల కోట్ల రూపాయలను 15 రకాలుగా విభజించామని మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ రోజు నుంచి ఆర్థిక ప్యాకేజీ లోని అంశాలను ఒక్కొక్కటిగా […]
దేశ ఆర్థిక వృద్ధి పెంచి, స్వయంసమృద్ధి భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. నవభారత్ నిర్మాణమే ఆత్మ నిర్భర భారత్ లక్ష్యమని చెప్పారు. భారత స్వయం పూర్వకంగా ఎదగాలనేదే తమ లక్ష్యమన్నారు. వివిధ స్థాయిల్లో సంప్రదించాక ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని తెలిపారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ అనే ఐదు మూల సూత్రాల ఆధారంగా ఆత్మ నిర్బర్ […]