iDreamPost
android-app
ios-app

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ 5.0

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ 5.0

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఐదో విడత ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఐదో దఫాలో ఏడు అంశాలకు సంబంధించిన ప్యాకేజీని విడుదల చేశారు. నరేగా, ఆరోగ్యం, విద్య, వ్యాపారాలు, సరళతర వ్యాపార విధానం, మోసాల నివారణ, రాష్ట్రాలకు ఆర్థిక వనరులకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.

– జాతీయ ఉపాధి హామీ పథకం కోసం అదనంగా 40 వేల కోట్ల రూపాయలు కేటాయింపు.

– విద్యా రంగం కోసం కొత్తగా 12 స్వయంప్రభ ఛానెళ్లు ఏర్పాటు.

– 20 కోట్ల జన్‌థన్‌ ఖాతాల్లో 10 వేల కోట్ల రూపాయలు జమ.

– భవన నిర్మాణ కూలీల ఖాతాల్లో 3,955 కోట్ల రూపాయలు జమ.

– మూడు నెలల పాటు పేదలకు ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్‌ సిలండర్లు.

– వైద్య సదుపాయాల కోసం రాష్ట్రాలకు 4,113 కోట్లు కేటాయింపు.

– టెస్టు కిట్లు కోసం 3,750 కోట్ల రూపాయలు కేటాయింపు.

– మండలస్థాయిలో ప్రజారోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు.

– 12 లక్షల ఈపీఎఫ్‌ ఖాతాదారులకు 3,660 కోట్లు విడుదల.

– రాష్ట్రాలకు 87 లక్షల ఎన్‌ – 95 మాస్కులు, 51 లక్షల పీపీఈ కిట్లు, 11.08 కోట్ల హెచ్‌సీక్యూ ట్యాబ్‌లెట్లు సరఫరా

– విపత్తుల నిర్వహణ కోసం ఏప్రిల్‌ నుంచి రాష్ట్రాలకు 46,038 కోట్లు విడుదల.

– ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ద్వారా 11,092 కోట్లు విడుదల.

– రాష్ట్రాలకు రెవెన్యూ భర్తీ కోసం 12,390 కోట్లు విడుదల.

– రాష్ట్రాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌ పరిమితిని ఆర్‌బీఐ పరిమితిని 60 శాతానికి పెంచింది.

– రుణాల్లో మరో 86 శాతం అందుబాటులో రాష్ట్రాలకు ఉన్నాయి.

– ఇప్పటి వరకూ రాష్ట్రాలు వినియోగించుకున్న రుణాలు పోను ఇంకా 4.28 లక్షల కోట్ల రుణాలు అందుబాటులో ఉన్నాయి.

– ఎంఎస్‌ఎంఈల దివాళాకు ప్రత్యేక విధానం రూపకల్పన.