Swetha
ఇరవై ఏళ్ళ క్రితం ఒకటే వే లో సాగిపోతున్న సీరియల్ ట్రెండ్ లో.. కొత్త ఆధిపత్యాన్ని చలాయించిన సీరియల్ అమృతం. ఒకటే సీరియల్ ఐదు సార్లు ప్రసారం అయిందంటే ఈ సీరియల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థంచేసుకోవచ్చు. దర్శకుడు రాజమౌళి సైతం ఈ సీరియల్ గురించి ఒకానొక టైం లో ఎలివేషన్ ఇచ్చారు.

ఇరవై ఏళ్ళ క్రితం ఒకటే వే లో సాగిపోతున్న సీరియల్ ట్రెండ్ లో.. కొత్త ఆధిపత్యాన్ని చలాయించిన సీరియల్ అమృతం. ఒకటే సీరియల్ ఐదు సార్లు ప్రసారం అయిందంటే ఈ సీరియల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థంచేసుకోవచ్చు. దర్శకుడు రాజమౌళి సైతం ఈ సీరియల్ గురించి ఒకానొక టైం లో ఎలివేషన్ ఇచ్చారు. రాజమౌళి బంధువు అయిన లెజెండరీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గుణ్ణం గంగరాజు ఈ సీరియల్ ను సృష్టించారు. ఆరోజుల్లోనే ఈ సీరియల్ ఎవర్ గ్రీన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
90’స్ కిడ్స్ కు ఇదొక స్వీట్ మెమరీ. మళ్ళీ ఈ సీరియల్ వస్తే బావుండు అని చాలా మంది అనుకునే ఉంటారు. అలాగే కొంతమంది ఇప్పటికీ యూట్యూబ్ లో చూస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అమృతం సీరియల్ పాత ఎపిసోడ్లనే రీమాస్టర్ చేయించి కొత్తగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు పాత సినిమాలను రీమాస్టర్ చేసి ఎలా అయితే రీరిలీజ్ చేస్తున్నారో.. అలానే ఇప్పుడు ఈ సీరియల్ ను కూడా రీలాంచ్ చేయనున్నారు.
ఈ సోమవారం నుంచి రోజుకు రెండు ఎపిసోడ్ల చొప్పున సరికొత్తగా ప్రేక్షకులను అలరించబోతోంది అమృతం. అప్పట్లో ఈ సీరియల్ కు ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఈ రీమాస్టర్డ్ వెర్షన్ ను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.