Swetha
ఓటిటి లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందులోను థ్రిల్లర్ సినిమాలంటే అసలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు . ఇప్పుడు ఓటిటి లో ఇలాంటి ఓ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ స్టార్ట్ చేస్తే అయ్యేవరకు అలానే కూర్చుంటారు. ఈ సినిమాలో తమిళ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు అమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా నటించింది.

ఓటిటి లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందులోను థ్రిల్లర్ సినిమాలంటే అసలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు . ఇప్పుడు ఓటిటి లో ఇలాంటి ఓ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ స్టార్ట్ చేస్తే అయ్యేవరకు అలానే కూర్చుంటారు. ఈ సినిమాలో తమిళ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు అమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7 న తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు రానుంది.
అసలు ఈ సినిమా కథే ఏంటంటే.. ఓ రోజు సెల్వ రాఘవన్ అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానెల్‌కి వెళ్తాడు. తాను ఒక ఫెయిల్యూర్ రైటర్ అని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు కూడా చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. ఇలా చెప్పి అలా ఆత్మహత్య చేసుకోవడంతో అంతా షాక్ అవుతారు. ఈ కేసును విష్ణు విశాల్ టేక్ ఓవర్ చేస్తాడు. సెల్వ రాఘవన్ చనిపోయినా సరే ఆ హత్యలు జరుగుతూ ఉంటాయి. అసలు ఆ హత్యలు ఎవరు చేస్తారు ? అంత దైర్యంగా అతను ఛానెల్ కు వెళ్లి మర్డర్ చేస్తానని ఎందుకు చెప్తాడు ? ఆ తర్వాత ఏమైంది ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పేరు ఆర్యన్.
ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ పెద్దగా కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 28నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ , మలయాళ భాషల్లో రానుంది. థియేటర్లో మిస్ అయినవారు ఓటిటి లో చూసేయొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.