Swetha
ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర పదికి పైగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయన్న మాటే కానీ ఒక్కదానికి కూడా సాలిడ్ ఓపెనింగ్స్ లేవు. ఉన్న సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయి మాత్రం కాస్త మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. కానీ మిగిలిన సినిమాలన్నీ కూడా వచ్చినట్లు కూడా చాలా వరకు తెలియదు.
ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర పదికి పైగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయన్న మాటే కానీ ఒక్కదానికి కూడా సాలిడ్ ఓపెనింగ్స్ లేవు. ఉన్న సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయి మాత్రం కాస్త మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. కానీ మిగిలిన సినిమాలన్నీ కూడా వచ్చినట్లు కూడా చాలా వరకు తెలియదు.
Swetha
ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర పదికి పైగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయన్న మాటే కానీ ఒక్కదానికి కూడా సాలిడ్ ఓపెనింగ్స్ లేవు. ఉన్న సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయి మాత్రం కాస్త మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. కానీ మిగిలిన సినిమాలన్నీ కూడా వచ్చినట్లు కూడా చాలా వరకు తెలియదు. ముఖ్యంగా అల్లరి నరేష్ 12ఏ రైల్వే కాలనీ గురించి చెప్పాలంటే కనీసం పాతికశాతం ఆక్యుపెన్సీ కూడా లేదని టాక్.
అల్లరినరేష్ కుగతంలో ఇలాంటి ఓపెనింగ్స్ ఎప్పుడు రాలేదు. దానికంటే బచ్చలమల్లి కాస్త బెటర్ అని అనిపించుకుంది. సినిమా హిట్ అయిందా లేదా ఫ్లాప్ అనేది పక్కన పెట్టేస్తే కాస్తయినా జనాల్లోకి సినిమా వెళ్ళాలి. పైగా ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫ్లాప్ అవుతుంటే ఆ హీరోలు కంటెంట్ సెలక్షన్ మీద ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఇకనైనా అల్లరి నరేష్ కంటెంట్ సెలక్షన్ విషయంలో కాస్త కేర్ తీసుకుంటే బెటర్.
ఇక ప్రియదర్శి , ఆనంది నటించిన ప్రేమంటే మూవీ కూడా పర్లేదు అనిపించుకుంది. కానీ ఇంకా ప్రేక్షకులను రాబట్టాల్సి ఉంది. ప్రమోషన్స్ వరకు బాగానే చేసారు. సుమ కూడా వీలైనంతలో సినిమాను ఎలివేట్ చేసింది. కానీ ఇంకా ఎక్కడో జనాల్లోకి మూవీ రీచ్ కాలేదు. సరే ఈ డైరెక్ట్ రిలీజ్ లు పక్కన పెట్టేస్తే రీరిలీజ్ లు ఈ మధ్య ఎలాంటి సందడి చేస్తున్నాయో తెలియనిది కాదు. కానీ ఇప్పుడు రీ మాస్టరింగ్ చేసి రీరిలీజ్ చేసిన కొదమ సింహం సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సో ఇవన్నీ బాక్స్ ఆఫీస్ కు ఓ రకంగా డేంజర్ బెల్స్ లానే ఉన్నాయి. ఇక ముందు ముందు రిలీజ్ అయ్యే సినిమాలు ఏ రకంగా బాక్స్ ఆఫీస్ పంట పండిస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.