ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న 150 కోట్ల రూపాయల విలువైన ఈఎస్ఐ స్కాంలో ప్రస్తుతం దొంగ పోలీస్ ఆట నడుస్తోంది. పక్కా ఆధారాలతో ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ మాజీ మంత్రి అచ్చెం నాయుడు సహా పలువురు మాజీ, తాజా అధికారులను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఇప్పుడు రెండో దఫా వేట మొదలుపెట్టింది. ఈ కేసులో కీలక పాత్ర అని ఏసీబీ నిర్థారించుకున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్, ఆయన మాజీ […]
హైదరాబాద్ లో పనిచేస్తున్న నలుగురు జర్నలిస్టులకు కరోనా వైరస్ ఎటాక్ అయ్యింది. ఈ నలుగురిలో ముగ్గురేమో నేషనల్ మీడియాలో ఫొటో జర్నలిస్టులు. ఎప్పుడైతే నలుగురు జర్నలిస్టులకు వైరస్ ఎటాక్ అయినట్లు బయటపడిందో వివిధ వర్గాల్లో టెన్షన్ మొదలైపోయింది. నాలుగో వ్యక్తేమో ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్న జర్నలిస్టు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రోజుల తరబడి పై నలుగురు జర్నలిస్టులు సచివాలయంతో పాటు మిగిలిన చోట్ల కూడా చాలామందితో కలిసే తిరుగుతున్నారట. ఎప్పుడైతే నలుగురు జర్నలిస్టులకు వైరస్ ఉందని […]
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌తో కలసి తాడేపల్లి నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకంటూ 63 రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి తీసుకున్నారు. 25వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖకు అక్కడ నుంచి సాయంత్రం రోడ్డు మార్గాన తాడేపల్లికి చేరుకునేందుకు ఏపీ డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే 25వ తేదీన విమాన […]
లాక్డౌన్ 3.0 నుంచి పలు అంశాలకు సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా 4.0 లో మరిన్ని సడలింపులు ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. అత్యంత ముఖ్యమైన రవాణా వ్యవస్థపై ఉన్న ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తోంది. ఇప్పటికే రోడ్డు రవాణా సేవలపై ఆంక్షలు తొలగించగా.. వచ్చే నెల 1వ తేదీ నుంచి సాధారణ రైళ్లు కూడా తిరిగేలా నిర్ణయాలు తీసుకుంది. తాజాగా విమానయాన సర్వీసులపై కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది. ఈ నెల 25వ […]
తెలంగాణలో లాక్ డౌన్ మే 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కెసిఆర్ దాదాపు అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్ మినహా రాష్ట్రం అంతటా దుకాణాలు తెరుచు కోవచ్చని ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో మాత్రం సరి – బేసి పద్ధతిన దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చు అన్నారు. నిన్నటి వరకూ ఇతర మునిసిపాలిటీ ల్లో ఇదే విధానాన్ని అవలంబించారు. అక్కడ ప్రస్తుతం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు అనుమతి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో సరి […]
మార్చ్ 24 నుండి కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ ఎట్టకేలకు తెలంగాణలో ఆంక్షలతో కూడిన వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి కే.సి.ఆర్. దేశ ప్రధాని నరేంద్ర మోడి లాక్ డౌన్ ని మరోసారి ఈ నెల31 వరకు పొడిగిస్తూ సడలింపు విషయాల్లో రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రగతిభవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ […]
తెలంగాణలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను కొద్దిసేపటి క్రితం కేసీఆర్ స్వయంగా వెళ్లడించారు. హైదరాబాద్ నగరం మినహా మిగతా ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోవచ్చని సీఎం తెలిపారు. అన్ని మత, విద్యా సంస్థలు పూర్తిగా మూసివేసి ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. బార్లు, క్రీడా మైదనాలు, క్లబ్లులు, పార్క్‌లు బంద్‌లో ఉంటాయని చెప్పారు. మెట్రో రైల్ బంద్, కర్ఫ్యూ కొనసాగుతుందని […]
కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ 3.0 నేటితో ముగియనుంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృశ్యా లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగింపునకు రంగం సిద్ధమైంది. మే 31 వరకూ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. దేశంలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న 30 ప్రాంతాల్లో లాక్ డౌన్ 4.0 కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్ర […]
హైదరాబాద్‌లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చనున్న ఆర్టీసీ బస్సులు లాక్డౌన్ కారణంగా అనేకమంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రజలు హైదరాబాద్‌లో చిక్కుకున్నారు. అలా చిక్కుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు వీలుగా హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకుంటే తప్ప ఈ బస్సుల్లో […]
కువైట్ నుండి హైదరాబాద్ చేరిన 163 మంది కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా కువైట్‌లో చిక్కుకున్న 163 మంది భారతీయులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్ ఇండియా-988 ఎయిర్‌లైన్స్ విమానం శనివారం రాత్రి 10.07 గంటలకు శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో వలస కూలీలతోపాటు, పర్యటన నిమిత్తం వెళ్లిన వారున్నారు. కరోనా(కొవిడ్-19)కారణంగా ప్రపంచ దేశాలన్నీ ప్రయాణాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచ దేశాల లాక్ డౌన్ కారణంగా అనేకమంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని […]