iDreamPost
android-app
ios-app

హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ బ్రాహ్మణి ప్రమాణాలు ఏమయ్యాయి .?

  • Published Apr 29, 2020 | 7:16 AM Updated Updated Apr 29, 2020 | 7:16 AM
హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ బ్రాహ్మణి  ప్రమాణాలు ఏమయ్యాయి .?

హైదరాబాద్ ఉప్పల్ లోని హెరిటేజ్ ఫుడ్స్ లో పనిచేస్తున్న యువకుడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో తెలంగాణా ప్రభుత్వం అతన్ని ఐసోలేషన్ కి తరలించగా , హెరిటేజ్ ఫ్యాక్టరీలో అతనితో సన్నిహితంగా మెలిగిన ఆరుగురు గార్డ్స్ , ప్రత్యక్ష సంభందం ఉన్న ఇరవై ఏడు మంది పాజిటివ్ అనుమానితుల సమాచారాన్ని తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా వారిని ఓ ఇంట్లో దాచి ఉంచిన విషయం స్థానికుల ధర్నాతో బయట పడిన విషయం తెలిసిందే . ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ హెరిటేజ్ వినియోగదారులు తమ ఆరోగ్య స్థితి గురించి బెంబేలెత్తుతున్నారు.

కరోనా కారణంగా సోషల్ డిస్టన్స్ , ప్రతి వస్తువుని ఆచితూచి కొనుగోలు చేసే క్రమంలో గత మార్చ్ 21 వ తారీఖు హెరిటేజ్ ఫుడ్స్ ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఇచ్చిన సందేశాన్ని విశ్వసించి చాలా మంది కష్టమర్స్ హెరిటేజ్ వినియోగించడం మొదలుపెట్టారు . ఆ సందేశం మీరూ చదవండి .

మార్చ్ 21,2020 నాడు .నారా బ్రాహ్మణి ప్రసంగంలోని ముఖ్య అంశాలు ….

భారతదేశం కరోనా వైరస్ భారినపడింది. మన ప్రధాని సామాజిక దూరాన్ని పాటించమని సూచన చేశారు… ఇప్పుడు వినియోగదారుల మనస్సుల్లో నిత్యావసర వస్తువుల మీద ఎన్నో ప్రశ్నలు తొలుస్తున్నవి..

నేను నారా బ్రాహ్మణి(ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్) హెరిటేజ్ ఫుడ్స్ తరుపున మేము తీసుకున్న జాగ్రత్తలు, మేము తయారు చేస్తున్న పాలు, వాటి అవసరం, ఎంతో వెసులుబాటుగా వినియోగదారులకు అందించే విధానం గురించి చెప్తున్నాను..

ప్రతీ విషయములో మేము అందించే స్వచ్ఛత, మేము తయారు చేసే విధానానికి వస్తే, మేము ప్రతీ ఉద్యోగి శారీరక ఉష్ణోగ్రత, దగ్గు మరియు జలుబు ని పరీక్షించాకే మా ఇండస్ట్రీ లోకి అనుమతిస్తున్నాం..

అనుమతించబడిన ప్రతీ ఉద్యోగి చేతులని పరిశుభ్రముగా కడుక్కొనేలా తప్పనిసరి చేస్తూ, దానిని మా సీసీటీవీ టీం పర్యవేక్షిస్తుంది… మేము తయారీలో 100% నిబద్ధతతో సేఫ్టీ పాటిస్తున్నాం.. మేము మా డెలివరీ బాయ్స్ కి హ్యాండ్ గ్లోవ్స్, సానిటైజర్స్ అందజేస్తున్నాం.. ఇంతటి రక్షణ తోనే మా పాలు మరియు పెరుగు మా డీలర్లు తో మరియు ఈ కామర్స్ ద్వారా వినియోగదారులుకు అందుబాటులో ఉంచాం..

మేము మా ఉద్యోగుల ఉన్నతమైన శ్రమ, సేవలను కొనియాడుతున్నాం.. ఈ కఠినమైన సమయంలో సామాజిక దూరాన్ని పాటించవల్సిందిగా మేము మా వినియోగదారుల్ని కోరుతున్నాం.. దయచేసి మీరు సామాజిక దూరాన్ని పాటించండి.. ఇంటిలోనే ఉండండి.. ఇంటినుండే పని చేయండి…

మా హెరిటేజ్ పాల విషయంలో మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం.. మీరు కూడా హెరిటేజ్ పాలు, పెరుగు వినియోగించే ముందు పాకెట్ లను శుభ్రంగా నీటితో కడగండి..

హెరిటేజ్ ఒక నిబద్ధత తో దేశం కోసం పాటుపడుతుంది……..

నారా బ్రాహ్మణి యొక్క ఈ స్పీచ్ విని ఒక నమ్మకంతో లాక్ డౌన్ సమయంలో హెరిటేజ్ ఉత్పత్తులు వాడిన వినియోగదారులు , సప్లై లింక్ ఉద్యోగస్తులు , రిటైల్ వ్యాపారులు నేడు తమ ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో హెరిటేజ్ సంస్థ పట్ల , డైరెక్టర్ బ్రహ్మణి ,బ్రాహ్మణి ల విశ్వసనీయత పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి .

తమ ప్లాంట్ లో పనిచేస్తున్న వారి ఫ్యామిలీ హెల్త్ అప్డేట్స్ తీసుకోకుండా యువకుడిని ఫ్యాక్టరీలోకి ఎలా అనుమతించారనేది అర్ధంకాని ప్రశ్న. ఆ యువకుడికి పాజిటివ్ అని తేలిన తర్వాత అతను ఫ్యాక్టరీలో పనిచేసిన విషయం తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా అతనితో సన్నిహితంగా ఉండి విధులు నిర్వహించిన వారి సమాచారం ప్రభుత్వానికి  తెలియజేయకపోవటం నిర్లక్ష్యం అనటం కన్నా ఏమైనా తమ పాల ఉత్పత్తి కి ఆటంకం రాకుడన్న యజమాని దృక్పథమే కనిపిస్తుంది .

కరోనా అనిమానితులు హెరిటేజ్ యాజమాన్యం ఎలా నిర్ధారించింది?అలా నిర్ధారించిన వారిని చుట్టుపక్కల వారికి ప్రమాదం కలగజేసే విధంగా సామూహికంగా ఓ ఇంట్లో దాచటం కోవిద్ చట్టం ప్రకారం నేరం అని తెలియని స్థితిలో హెరిటేజ్ యాజమాన్యం ఉందా? .
కరోనా సోకినా వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా వారి ప్రాణాల్ని , చుట్టుపక్కల నివాసితుల ప్రాణాల్ని ప్రమాదంలో పడవేయడం కచ్చితంగా నేరమే.

హెరిటేజ్ యాజమాన్యం దాచిన 33 మంది ఉద్యోగస్తుల వివరాలు బయట పెట్టకపోవడం వలన వారితో సన్నిహితంగా మెదిలిన , ఉద్యోగులు , కుటుంబ సభ్యులు , వారి కాంటాక్ట్స్ లాంటి వన్నీ ప్రభుత్వం వెరిఫై చేసే అవకాశం లేకుండా చేయడం వలన వారిని ప్రమాదంలోకి నెట్టారు.

అలాగే ఫ్యాక్టరీలో 33 మందిని అనుమానితులుగా గుర్తించిన తర్వాత ఫ్యాక్టరీలో ఉత్పత్తి , సరఫరా నిలిపివేసి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వవలసింది.

ఆరోగ్య అత్యవసర స్థితిలో పూర్తి జాగ్రత్తలు తీసుకొని సరఫరా చేస్తున్నాము మమ్మల్ని నమ్మండి అని ప్రమాణం చేసిన డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఏ విధమైన ప్రమాణాలు పాటించకపోగా కేవలం స్వలాభం కోసం ప్రాణాంతకమైన కరోనా వ్యాధి అనుమానితుల్ని దాచి , వారి ప్రాణాలు , వినియోగదారుల ప్రాణాలు ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టడం నేరమే కాదు దేశ ద్రోహం కూడా.

ఈ ఘటనకు బ్రాహ్మణి మాత్రమే కాదు , మరో డైరెక్టర్ అయిన నారా భువనేశ్వరి ఇతర డైరెక్టర్లు కూడా బాధ్యులే . తెలంగాణా ప్రభుత్వం ఈ దుర్ఘటనల పట్ల ఏ విధమైన చర్యలు తీసుకొంటుందో వేచి చూడాలి .

తన చేతికి ఆంధ్రా పగ్గాలు ఇస్తే వారంలో కరోనాని కట్టడి చేస్తానని ప్రచారం చేసుకొంటూ , తనని సలహాలు అడగమంటున్న చంద్రబాబు తన కుటుంబ సభ్యులు చేసిన ఈ నేరానికి ఏమని సమాధానం చెబుతారో ఆసక్తికరం.చెప్పే మాటలకు చేసే పనుల మధ్య పొంతన లేకుండా లాభాపేక్షతో వ్యవహరించటం మీద చట్టం ఏమి చేస్తుందో తరువాత సంగతి ముందు హెరిటేజ్ యాజమాన్యం నైతిక బాధ్యత వహించాలి.