ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో రోజుకొక సంఘటనతో అనూహ్య మలుపులతో పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల తర్వాత తనకు తానుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా రమేశ్ కుమార్ ప్రకటించుకోవడం, ఆ వెంటనే ఉత్తర్వులను కూడా రెడీ చేయించుకోవడం తెలిసిందే. అయితే దీనిపై అడ్వొకేట్ జనరల్ స్వయంగా మీడియా ముందకొచ్చి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయను పునర్నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులపై కమిషన్ కార్యాలయ ఇన్చార్జి కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనకడుగు వేయడంలేదు. ముఖ్యమంత్రి జగన్ తాను ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఆర్ధిక భరోసా అందించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మందికి వివిద పధకాల ద్వారా నేరుగా లబ్ది చేకూర్చారు. అయితే ఇప్పుడు తాజాగా తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరో పధకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్దం […]
పేదల ఇళ్లకు కొత్త టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పథకానికి కొత్త హంగులు సమకూరనున్నాయి. పేదల కోసం జగనన్న కాలనీల పేరుతో నిర్మించి ఇచ్చే 30 లక్షల ఇళ్లలో గరిష్టంగా 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా, విద్యుత్ ఆదా చేసేలా కొత్తగా ఇండో- స్విస్ టెక్నాలజీని అమల్లోకి తేనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. గృహ […]
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ , జీవోల వలన తాను పదవి కోల్పోయానని మాజీ ఈసీ నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేయడం , దానికి కౌంటర్ గా పంచాయితీ రాజ్ శాఖ చీఫ్ సెక్రటరీ ద్వివేది , ఈసీ సెక్రటరీ రామ్ సుందర రెడ్డిలు పలు అంశాలతో కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . అయితే నిన్న సోమవారం ప్రస్తుత ఎన్నికల కమిషనర్ కనగరాజ్ పలు న్యాయపరమైన అంశాలతో మరో పిటిషన్ దాఖలు చేశారు […]
తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలిసినట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. లాక్ డౌన్ వల్ల ఇళ్ల కే పరిమితమైన పేదలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తోచిన విధంగా సహాయాన్ని అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో మనిషికి 12 కిలోల బియ్యం, కార్డుదారులకు 1500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తోంది. ఇప్పటికే రేషన్ డిపోల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేయగా.. తాజాగా రెండు రోజుల క్రితం తెల్ల […]
ప్రస్తుతం మానవ సమాజం కరోనా లాంటి విపత్తులు మునుపెన్నడూ చూసి ఉండదు. 1940వ దశకంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధాన్ని చూసిన వారు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. వారు కూడా కరోనా వైరస్ లాంటి విపత్తులు చూసి ఉండరు. ప్రస్తుతం మానవ జాతి పెనుముప్పును ఎదుర్కొంటోంది. కనిపించే శత్రువుతో యుద్ధం చాలా సులువు. కానీ కనిపించని శత్రువుతో యుద్ధం ఎలా చేయడం. ఇప్పుడు యావత్ ప్రపంచం అంతా ఈ విషయంపైనే మల్లగుల్లాలు పడుతోంది. అభివృద్ధి […]
లాక్ డౌన్ నెపధ్యంలో ప్రయాణాలు, రోజువారి కూలి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పనుల కోసం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీల పరిస్తితి దుర్భరంగా మారింది. ఈ నెపధ్యంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి రాష్ట్రంలో చిక్కుకుపోయిన కూలీలకు భోజన వసతులు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఇతర రాష్ట్రాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. వలస కూలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 393 […]