Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో రోజుకొక సంఘటనతో అనూహ్య మలుపులతో పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల తర్వాత తనకు తానుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా రమేశ్ కుమార్ ప్రకటించుకోవడం, ఆ వెంటనే ఉత్తర్వులను కూడా రెడీ చేయించుకోవడం తెలిసిందే. అయితే దీనిపై అడ్వొకేట్ జనరల్ స్వయంగా మీడియా ముందకొచ్చి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయను పునర్నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులపై కమిషన్ కార్యాలయ ఇన్‌చార్జి కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇది జరిగిన కొద్ది సేపటి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా 1996 బ్యాచ్‌కు చెందిన జి. వాణీ మోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె సహకార కమిషన్ కార్యదర్శిగా ఉన్నారు. దీంతోపాటు ఏపీ డైరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఎండీగా, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా, ఎన్నికల కమిషర్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
కాగా, హైకోర్టు తీర్పును బట్టి అసలు ఎన్‌ఈసీగా రమేశ్‌కుమార్ నియామకమే చెల్లదని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పలు సెక్షన్లను ఆయన చదివి వినిపించడంతో రమేశ్ కుమార్, ఆయన మద్దతు దారులు ఆత్మరక్షణ ధోరణిలో పడినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఈ తాజా నియామకమని పలువురు పేర్కొంటున్నారు.