ఇక్కడ ఫోటోలో మూడు బాషలకు చెందిన ముగ్గురు స్టార్లు ఉన్నారు. తెలుగు చిరంజీవి, తమిళ రజినీకాంత్, కన్నడ రవిచంద్రన్. ఈ కలయిక రాజా విక్రమార్క సినిమా ఓపెనింగ్ సందర్భంగా తీసుకున్నది. ఇందులో అంతకు మించి ప్రత్యేకత ఏమి లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అది కూడా చిరుకి కనెక్షన్ ఉన్నది. అదేంటంటే రజినీకాంత్, రవిచంద్రన్ నటించిన రెండు బ్లాక్ బస్టర్స్ లో చిరు స్పెషల్ క్యామియో చేయడం. మొదటిది రజని మాపిల్లై. 1989లో విడుదలైన ఈ […]
గతమెప్పుడూ తీయని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అందులోనూ సినిమాకు సంబంధించినది అయితే ఇక దాని గురించి చెప్పేదేముంది. ఇక్కడ మీరు చూస్తున్న పిక్ అలాంటిదే. ఇందులో ముగ్గురు హీరోలు ఒక దర్శకులు(తర్వాత ఆయనా హీరో అయ్యారు లెండి) ఉన్నారు. కాకపోతే ఒకే మూవీ కోసం కలుసుకున్న సందర్భం అయితే కాదు. అనుకోకుండా జరిగిందిది. 1994లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాషా’, ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తీస్తున్న ‘టాప్ […]
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ పెద్దగా ఆడలేదు కాని అందులో తలైవా స్టైలింగ్ కి అభిమానులు బాగా ఖుషీ అయ్యారు. తెలుగులోనే ఓ మాదిరిగా ఆడింది కాని తమిళ్ లో మాత్రం డిజాస్టర్ అయిపోయి కొన్నవాళ్ళకు భారీ నష్టాలు మిగిల్చింది. ఫలితం సంగతి ఎలా ఉన్నా దర్బార్ లో తండ్రికూతుళ్ళుగా నటించిన రజిని-నివేదా థామస్ ల బాండింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో దర్శకుడు మురుగదాస్ దాన్ని […]
ఒక చిన్న హీరోగా కెరీర్ గా మొదలుపెట్టి దశాబ్దం పైగా కష్టపడి సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్ళతో ధీటుగా మార్కెట్ ఏర్పరచుకోవడం అంటే మాటలా. అజిత్ ది అలాంటి కథే. ఇతను పుట్టింది హైదరాబాద్ లోనే. తండ్రి తమిళ్ తల్లి సింధీ ప్రాంతానికి చెందినవారు. పిజి స్థాయి చదువులు పూర్తి చేయకపోయినా అజిత్ జ్ఞానం అపారం. నటుడిగా కెరీర్ ని మొదలుపెట్టాలనుకున్న టైంలో అజిత్ తొలి ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 1990లో చిన్న వేషం […]
సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ కు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవచ్చు కానీ గుర్తింపు మాత్రం బాగానే ఉంది. దానికి కారణం రఘువరన్ బిటెక్. అప్పట్లో ఇది సాధించిన భారీ విజయం తర్వాత ఎన్నో డబ్బింగ్ చిత్రాలను వచ్చేలా చేసింది కానీ ఏ ఒక్కటీ ఆడకపోవడంతో ఆ తర్వాత ధనుష్ వి అనువదించడం మానేశారు. వడ చెన్నై లాంటి మాస్టర్ పీస్ కూడా మనకు చూసే అవకాశం దక్కలేదు. సరే అసురన్ బ్రహ్మాండంగా ఆడింది కదా […]
కరోనా కలకలం పరిశ్రమను కుదిపేస్తున్న వేళ డాన్స్ మాస్టర్ కం దర్శకుడు లారెన్స్ రాఘవ తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే అనూహ్యంగా విరాళంతో పాటు రజినీకాంత్, తన ఫ్యాన్స్ కు బంపర్ న్యూస్ ఇచ్చేశాడు. దాతృత్వం విషయానికి వస్తే తనది మరోసారి ఎంత పెద్ద చేయో నిరూపించాడు. ఏకంగా 3 కోట్ల మొత్తాన్ని కరోనా సహాయ నిధులకు అందజేశాడు. కోలీవుడ్ మొత్తంలో ఇదే పెద్ద ఫిగర్ కావడం గమనార్హం. లారెన్స్ కన్నా ఎంతో […]
దర్శకుడు సురేష్ కృష్ణ పేరు చెప్పగానే సాధారణంగా వెంటనే ఫ్లాష్ అయ్యే సినిమా బాషా. రజినీకాంత్ కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ మూవీ గురించి ఫ్యాన్స్ కి ఎప్పుడు చెప్పినా గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. కానీ సురేష్ కృష్ణ అంతకు ముందే చాలా గొప్ప సినిమాలు తీశారనే విషయం మూవీ లవర్స్ కు తెలుసు. అందులోనూ కెరీర్ లోని మొదటి మూడు సినిమాల్లో రెండు తెలుగులోనే స్ట్రెయిట్ గా చేశారంటే ఆశ్చర్యంగానే […]
సినిమా పరిశ్రమలో అంతా కమర్షియల్ అనుకుంటాం కానీ ఇక్కడ కూడా చాలా గొప్ప స్నేహ బంధాలు ఉంటాయి . అందులోనూ రజనికాంత్, చిరంజీవిలు వీటికి పెట్టింది పేరు. ఈ కాంబోలో చాలా ఏళ్ళ క్రితం అంటే 80వ దశకం ప్రారంభంలో కాళి, బందిపోటు సింహం లాంటి సినిమాలు వచ్చాయి కాని ఇద్దరూ పెద్ద స్టార్లయ్యాక మాత్రం కలిసి నటించలేదు. ఎవరికి వారు విడివిడిగా పోటీ హీరోలు అందుకోలేని స్థాయికి చేరుకోవడంతో ఈ కాంబినేషన్ సెట్ చేయడం ఎవరి […]