iDreamPost
iDreamPost
దర్శకుడు సురేష్ కృష్ణ పేరు చెప్పగానే సాధారణంగా వెంటనే ఫ్లాష్ అయ్యే సినిమా బాషా. రజినీకాంత్ కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ మూవీ గురించి ఫ్యాన్స్ కి ఎప్పుడు చెప్పినా గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. కానీ సురేష్ కృష్ణ అంతకు ముందే చాలా గొప్ప సినిమాలు తీశారనే విషయం మూవీ లవర్స్ కు తెలుసు. అందులోనూ కెరీర్ లోని మొదటి మూడు సినిమాల్లో రెండు తెలుగులోనే స్ట్రెయిట్ గా చేశారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.
1988లో కమల్ హాసన్ సత్యతో దర్శకుడిగా కోలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టిన సురేష్ కృష్ణ ఆ తర్వాత అదే సంవత్సరం రామానాయుడు గారి సురేష్ బ్యానర్ లో వెంకటేష్, రేవతి జంటగా ప్రేమ తీసి అవార్డులతో బోలెడు కలెక్షన్లు, ప్రశంశలు దక్కించుకున్నారు. దీన్నే తమిళ్ లో అన్బు చిన్నం పేరుతో డబ్ చేస్తే అక్కడా సూపర్ హిట్ అయ్యింది. దాంతో రామానాయుడు మరో ఛాన్స్ తన సంస్థలోనే ఇచ్చారు. 1989లో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో పరుచూరి సోదరులు రచించిన ఒక డిఫరెంట్ స్టోరీని తీసుకుని ఇంద్రుడు చంద్రుడు తీశారు. ఇక్కడ మీరు చూస్తున్న పిక్ దాని ఓపెనింగ్ షాట్ దే. విజయశాంతి హీరోయిన్ గా ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్.
తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన కమల్ ని సురేష్ కృష్ణ చాలా డిఫరెంట్ గా చూపించిన తీరుకు అభిమానులు ముగ్దులయ్యారు. ఒకదానితో మరొకటి సంబంధమే లేని రోల్స్ ని లోక నాయకుడు పోషించడం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంద్రుడు చంద్రుడు శతదినోత్సవం కూడా జరుపుకుంది. తర్వాత అమ్మ అనే మరో సినిమా ఉషాకిరణ్ బ్యానర్ లో చేశారు సురేష్ కృష్ణ. తమిళ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాక చాలా గ్యాప్ తీసుకుని చిరంజీవితో మాస్టర్ చేసి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ఇంద్రుడు చంద్రుడు ఇప్పటికీ వన్ అఫ్ ది బెస్ట్ ఎంటర్ టైనర్స్ గా చెప్పుకోవచ్చు.