మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప చిక్కుల్లో పడ్డారు. ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి రెండో వివాహం జరిపించిన నేరంలో వారిపై కేసు నమోదయ్యింది. యనమల స్వగ్రామంలో ఏర్పాటు చేసిన వివాహ కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే తనను పెళ్లి చేసుకుని మోసం చేసి మరో పెళ్లికి చేసిన విషయంలో ఈ తతంగం నడిచింది. రెండో పెళ్లికి సిద్ధపడిన సదరు వరుడు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు కావడం విశేషం. […]
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ నేతలు మేథావిగా భావించే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అచ్చెం నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలపై అరెస్ట్‌పై స్పందించారు. తన భాష ప్రావిణ్యాన్ని ఉపయోగించి ప్రాసలతో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని చెప్పుకొచ్చారు. అచ్చెం నాయుడు అరెస్ట్ ఒక తప్పు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ మరో తప్పు, జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్ […]
వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శలు, ఆరోపణలు చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉండే మాజీ మంత్రి, టీడీపీ మండలి నేత యనమల రామకృష్ణుడు ఈ రోజు మళ్ళి తెరపైకి వచ్చారు. రాష్ట్రప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చేస్తోందంటూ యనమల విమర్శించారు. మద్యం తయారీ కంపెనీల ఒత్తిడి మేరకే సీఎం వైఎస్ జగన్ మద్యం ధరలు 25 శాతం మేర పెంచారని ఆరోపించారు. తన ప్రజా సంకల్ప పాదయాత్ర లో మద్యం రక్కసి వల్ల చిన్నాభిన్నమైన కుటుంబాల […]
యనమల రామకృష్ణుడు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి…ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేత. కాగా తాజాగా టెలీమెడిసిన్ కు వైఎస్సార్ పేరు పెట్టడడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానుషంగా ఉన్నాయి. సామాన్యుడు కూడా వాడకూడని, మాట్లాడకూడని పదాలను ఒక మాజీ స్పీకర్ అయ్యుండి ప్రయోగించడం నిజంగా దురదృష్టకరం. ఆ పేర్లయితే ఓకేనా… టెలీమెడిసిన్.. నేరుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండానే ఫోన్, ఇతర వర్చువల్ మార్గాల్లో వైద్య సహాయం అందించే విధానం. ఇది విదేశాల్లో చాలా కాలం […]
గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉంది టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడి వ్యవహారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేరుతో హల్చల్ చేసిన లేఖ నిన్న, ఈ రోజు మీడియాలో సృష్టించిన రాజకీయ దుమారం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ లేఖ తాను రాయలేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ రోజు జాతీయ వార్త ఛానెల్ ఏఎన్ఐకి చెప్పారు. మరో వైపు ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి […]