అనుభవశాలి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు… తన అనుభవాన్ని ప్రజోపయోగమైన నిర్ణయాలకు ఉపయోగించకుండా ప్రభుత్వం పై ఎప్పుడు ఏ విధంగా అక్కసు వెళ్ళ గక్కుదామా అనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మహానాడు ఎజెండా లోనూ.. జగన్ టార్గెట్ గానే ఎక్కువ అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా.. ఆయన చేసిన ట్వీట్లలోనూ అదే కనిపించింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో బాహుబలిని మించిన గ్రాఫిక్స్ తో వీడియోలు ప్రజెంటేషన్ […]
టిడిపి ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జూమ్ ద్వారా జరిగింది. టిడిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మహానాడుకు కొంత మంది నేతలు డుమ్మా కొట్టారు. కొంత మంది హాజరైనా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ మహానాడు కేవలం అధికార వైసిపిని తిట్టడానికి, చంద్రబాబును పొగుడుకోవడానికి పెట్టినట్టు జరిగింది. టిడిపిలో నేతలెవ్వరూ కృషి లేనట్లు..ఒక్క చంద్రబాబు కృషి మాత్రమే ఉన్నట్లు ఆయనను సంతృప్తి పరిచేందుకే ఆయన భజన బృందం మొగ్గు […]
రెండు రోజుల మహానాడు తర్వాత జరిగిన పరిణామం చూస్తుంటే అలాగే ఉంది. బుధ, గురువారాల్లో టిడిపి నిర్వహించిన రెండు రోజుల డిజిటల్ మహానాడు అయిపోగానే శుక్రవారం చంద్రబాబునాయుడు, చినబాబు తిరిగి హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. కరోనా వైరస్ దెబ్బకు 65 రోజులుగా హైదరాబాద్ లోని ఇంట్లో లాక్ డౌన్లో ఉండిపోయిన తండ్రి, కొడుకులు అమరావతికి చేరుకున్నదే మహానాడు కోసమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసలు ముందుగా హైదరాబాద్ నుండి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించి అక్కడి నుండి […]
బాలకృష్ణ గురించి టీడీపీ నాయకులు ఎవరైనా మాట్లాడాల్సిన సందర్భం వస్తే చాలా ఆచితూచి మాట్లాడతారు . మా బాలయ్యది పసిపిల్లోడి మనస్తత్వం అండీ , మనసులో ఏదీ ఉంచుకోడు .బోలా శంకరుడి లాంటి వాడు లాంటి పదజాలం వాడుతూ ఇబ్బందికరంగా చూస్తూ రెండు ముక్కల్లో ముగించే ప్రయత్నం చేస్తారు . ఎవరి పట్ల అయినా దురుసుగా ప్రవర్తించిన విషయం కానీ చెయ్యి చేసుకొన్న ఘటనలు కానీ ప్రస్తావనకు వస్తే అబ్బే ఆయన కోపం తాటాకు మంట లాంటిది […]
38 ఏళ్ల వయస్సును రాజకీయ పార్టీ, 42 ఏళ్ల రాజకీయ అనుభవంతో దేశంలోనే సీనియర్ రాజకీయ వేత్త అని చెప్పుకునే నాయకుడు ఉన్న పార్టీ, మా బలం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే అని చెప్పుకునే పార్టీ పని, ఆ నాయకుడి సత్తా అయిపోనట్లు ఆ పార్టీనేతలు గుర్తించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు, కార్యకర్తల సంక్షోభం నుంచి బయటపడేందుకు మోదీనే దిక్కు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిర్ణయానికి వచ్చారు. వారు రావడమే కాదు.. […]
కేవలం ప్రచారం కోసమే రాజకీయాలు..ప్రచారంతోనే రాజకీయాలు..ప్రచారం మూలంగానే రాజకీయాలు చేస్తున్న, చేయగలిగిన, చేసే నాయకుడు చంద్రబాబు ఒక్కరేమో అనిపిస్తోంది. ఆయన ఏది చేసినా ప్రచారం కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రచారం వస్తే చాలు ఏది చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా మహానాడు పేరుతో సాగించిన ప్రహసనం కూడా అందులో భాగమే. పూర్తిగా ప్రచార ఆర్భాటమే తప్ప చంద్రబాబు కి ఒనగూరిన ప్రయోజనం గానీ, టీడీపీకి కలిగిన ప్రయోజనం గానీ ఓ కోశాన కనిపించదు. అయినప్పటికీ రెండు నెలల […]
’పార్టీ నుండి నేతలు ఎంతమంది వెళ్ళిపోయిన బాధ లేదు. ఎందుకంటే పార్టీకి పటిష్టమన క్యాడర్ ఉంది’ అని చంద్రబాబునాయుడు కొన్ని లక్షల సార్లు చెప్పుంటాడు. అసలు క్యాడర్ లేనిదే పార్టీ లేదని కూడా చెప్పిన విషయం అందరూ చూసిందే. మరలాంటి క్యాడర్ కు మహానాడులో మాట్లాడే అవకాశమే ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు, నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు ఎప్పుడూ ఉండేవే కదా. సందర్భం ఏదైనా చంద్రబాబు, నేతలు మాట్లాడేది ఒకటేగా ఉంటుంది. తనను తాను పొగుడుకోవటం, జగన్మోహన్ […]
మూడు సార్లు.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి.. తన హయాంలో ప్రజల కోసం ఫలానా పథకం ప్రవేశపెట్టాను, ఫలానా విధంగా మేలు చేశాను అని చెప్పుకునేందుకు ఒక్క పని లేదంటే అతిశయోక్తిగా ఉంది. అయినా ఇది నిజమే. ఎందుకంటే తన హాయంలో ప్రజల కోసం ప్రవేశపెట్టానని ఒక్క పథకం కూడా చెప్పని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెట్టిన పథకాలను ఈ రోజు జరిగిన జూమ్ మహానాడులో ఏకరవు […]
మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటుందంటే మూడు అంశాలే ప్రధానంగా ఉంటుంది. మొదటిది పార్టీ ప్రస్తుత బలం ఏమిటి ? బలహీనత ఏమిటి ? అనే విషయాలపై చర్చలు జరుగుతుంది. ఇక రెండో అంశం ఏమిటంటే అధికారంలో ఉన్నప్పటికీ ఓడిపోయామంటే అందుకు కారణాలు ఏమిటి ? అనేది. చివరగా మూడో అంశం ఏమిటంటే మళ్ళీ భవిష్యత్తులో బలపడాలన్నా అధికారంలోకి రావాలన్నా తీసుకోవాల్సిన చర్యలేమిటి ? అనే విషయాలపై నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుంటుంది. కానీ […]
మహానాడు అంటే ఓ పండుగ. టీడీపీ శ్రేణులకు పెద్ద పండుగ. కదిలి రండి తెలుగుదేశ కార్యకర్తలరా అనగానే ఉప్పొంగే ఉత్సాహం.. ఉరకలెత్తే ఆనందం. ఇదంతా ఒకనాటి వైభోగం. వర్తమానం నిండా నిర్వేదం.. నిరాశ.. నమ్మకం కోల్పోయిన నాయకత్వం తో నానాటికీ తీసికట్టు గా మారుతున్న నైరాశ్యం. తెలుగుదేశం చరిత్రలోనే అత్యంత గడ్డు స్థితిలో ప్రస్తుతం మహానాడు మొదలవుతుంది. అదే సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగాను, నాయకుడిగాను, పార్టీ పరంగానూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న దశలో మహానాడు జరుగుతోంది. దాంతో […]