iDreamPost
android-app
ios-app

కరోనా భయానికే చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోయాడా ?

  • Published May 30, 2020 | 3:12 AM Updated Updated May 30, 2020 | 3:12 AM
కరోనా భయానికే చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోయాడా ?

రెండు రోజుల మహానాడు తర్వాత జరిగిన పరిణామం చూస్తుంటే అలాగే ఉంది. బుధ, గురువారాల్లో టిడిపి నిర్వహించిన రెండు రోజుల డిజిటల్ మహానాడు అయిపోగానే శుక్రవారం చంద్రబాబునాయుడు, చినబాబు తిరిగి హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. కరోనా వైరస్ దెబ్బకు 65 రోజులుగా హైదరాబాద్ లోని ఇంట్లో లాక్ డౌన్లో ఉండిపోయిన తండ్రి, కొడుకులు అమరావతికి చేరుకున్నదే మహానాడు కోసమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసలు ముందుగా హైదరాబాద్ నుండి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించి అక్కడి నుండి అమరావతి చేరుకోవాలన్నది అసలు ప్లాన్. అక్కడికి సాధ్యం కాకపోవటంతో అమరావతికి నేరుగా వచ్చేశాడు.

అమరావతికి వచ్చేటప్పుడు లాక్ డౌన్ ఉల్లంఘనలను ఉల్లంఘించాడంటూ చంద్రబాబు, చినబాబుపై కోర్టులో కేసు దాఖలై విచారణ కూడా మొదలైంది. ఈ నేపధ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం అమరావతిలో బయలుదేరి తిరిగి హైదరాబాద్ కు చేరుకోవటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహానాడు అయిపోయిన తర్వాత అమరావతి నుండి పర్మిషన్ తీసుకుని వైజాగ్ వెళతాడని పార్టీ నేతలు అనుకున్నారు. ఎందుకంటే గ్యాస్ ప్రమాదం జరిగిన దగ్గర నుండి ఆర్ఆర్ వెంకటాపురం వెళ్ళటానికి చంద్రబాబు చేసిన గోల అందరికీ తెలిసిందే.

మొదటేమో హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో వైజాగ్ వెళ్ళటానికి విచిత్రంగా కేంద్రాన్ని పర్మిషన్ అడిగాడు. కేంద్రం ఏమని చెప్పిందో తెలీదు. ఆ తర్వాత కొద్ది రోజులకు రెండు రాష్ట్రాల డిజిపిలను అనుమతి అగిగాడు. ఇద్దరు డిజిపిలు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అనూహ్యంగా విమానాలు రద్దయ్యాయి. దాంతో చేసేది లేక వైజాగ్ టూర్ రద్దు చేసుకున్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుండి టూర్ రద్దు చేసుకునేంతవరకూ తన మనస్సంతా వైజాగ్ లోనే ఉందని చాలా సార్లు చెప్పాడు. అందుకనే మహానాడు అయిపోగానే చంద్రబాబు, చినబాబు వైజాగ్ వెళతారని అనుకున్నారు.

అయితే అనూహ్య గా తండ్రి, కొడుకులు మాత్రం హైదరాబాద్ వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో వైజాగ్ వెళితే పార్టీ నేతలు, కార్యకర్తలను కంట్రోల్ చేయటం కష్టం. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే కేసు నమోదైంది. మళ్ళీ ఇటువంటి కేసులే మరిన్ని నమోదయ్యే ప్రమాదం ఉందని అనుమానించారు. అలాగే తన దగ్గరకు వచ్చే వారిలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే అది తనకు కూడా సోకే ప్రమాదముంది.

అసలు 70 ఏళ్ళ వయస్సున్న వారిని బయట తిరగొద్దని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్న విషయం అందరూ చూస్తున్నదే. కాబట్టి వైరస్ సమస్య భయంతోనే చినబాబును తీసుకుని చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోయాడన్నది అర్ధమవుతోంది. మరి తాను ఎవరికీ భయపడేది లేదని, దేనికీ భయపడేది లేదని ఇంతకాలం చెప్పిందంతా …..